is it good to drink water in copper bottle

ఇందులో నీరు తాగడం అమృతమా?? విషమా??

మనుషులు ఎంత సంపాదించినా పరిపూర్ణ ఆరోగ్యం లేకుంటే జీవితం వ్యర్థమే. అందుకే ఆరోగ్యం మీద అవగాహన కోసం చాలా మంది బోలెడు పద్ధతులు పాటిస్తుంటారు. అయితే అవి నిజమా కాదా అనేది తెలుసుకోకుండా పాటించడం వల్ల అప్పటిదాకా ఉన్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తాయి. అందరూ అలా పాటించే పద్ధతుల్లో ఒకటి రాగి పాత్రలో నీరు. ఇది పాతకాలపు పద్ధతే అయినా ఇప్పటి కాలానికి మళ్ళీ కొత్తగా మొదలెట్టినట్టే ఉంది. అయితే రాగి పాత్రలో నిల్వచేసిన నీరు తాగడం నిజాగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?? అయితే ఎలా అనే విషయం ఒక్కసారి తెల్సుకుందాం.

రాగి వాటర్ ఫిల్టర్ లు, రాగి చెంబులు, రాగి జార్ లు, రాగి గ్లాస్ లు అబ్బో ఇప్పట్లో బోలెడు. అయితే చాలా మంది ఆరోగ్యం మీద అవగాహనతో రోజు రాగిపాత్రలో నీరు తాగుతున్నారు. రాగి పాత్రలో నీటిని నిల్వ చేసినపుడు రాగిలో ఉన్న ఎలాక్ట్రాన్లు నీటితో చర్య జరిపి నీళ్లను శక్తివంతమైన గుణాన్ని కలిగిస్తాయి. అయితే ఇది ఒకేసారి రాగి పాత్రలో నీరు పోసి తాగితే వచ్చేది కాదు మరేం చేయాలి అంటే…..

రాగి పాత్రలో రాత్రి పూట నీటిని పోసి ఉదయం వరకు అలాగే ఉంచాలి నీరు రాగి పాత్రలో కనీసం 8 గంటల సేపు నిల్వ ఉండటం వల్లనే నీటికి అమితమైన శక్తి లభిస్తుంది. అయితే ఆ శక్తి ఏంటి అది ఎలా మన శరీరానికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే  పూర్తిగా తెలుసుకోండి

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిలో మన శరీరంలో ఉన్న త్రిగుణాలైన వాత, పిత్త, కఫ దోషాలను నిర్మూలించే సామర్థ్యము ఉంటుంది. నీటిలో స్వతాహాగా ఉన్న బాక్ట్రిరియా ను రాగి పాత్ర నుండి విడుదల అయ్యే ఎలాక్ట్రనులు నిర్వీర్యం చేస్తాయి. అందుకే రాగి పాత్రలో నీరు ఇప్పటి కాలం లో మినరలైజ్ వాటర్ కంటే శక్తిమంతమైనవి.  ఈ నీటికి  పచ్చకామెర్లు(జండీస్) మరియు డయోరియా ను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. 

అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళ శరీరంలో  కాపర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. రాగి పాత్రలో నీటిని తీసుకోవడం వల్ల కాపర్ లోపం తొలగిపోయి థైరాయిడ్ కూడా నయమవుతుంది.

కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు రాగిపాత్రలో నీటిని తాగడం వల్ల కీళ్ల సందుల్లో ఉన్న వాతం హరించి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

మొటిమలకు ముఖ్యకారణమైన రక్తంలో మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేసి సమస్యను దూరం చేస్తుంది. అలాగే రక్త శుద్ధి మాత్రమే కాకుండా మన శరీరంలో హిమోగ్లోబిన్ వృద్ధికి కారణమై అనిమియాను తగ్గిస్తుంది.

మనం తినే ఆహారం వల్ల జీర్ణాశయంలో  ఏర్పడ్డ వ్యర్థాలను తొలగించడానికి రాగి పాత్ర నీరు అద్భుతంగా పనిచేస్తాయి. పొట్టని డిటాక్సిఫైడ్ చేసుకోవడం వల్ల సమస్య తొలగిపోతుంది.

అదిక బరువు ఉన్నవాళ్లు రాగి పాత్ర నీటిని ప్రతిరోజు తాగడం వల్ల శరీరం లో ఉన్న కొవ్వు నిల్వలలు కరిగిపోయి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

చివరగా….

ఇన్ని లాభాలు ఉన్న రాగి పాత్ర లో నిల్వ చేసిన నీటిని వాడుతూ ఆరోగ్యాన్ని ఫిల్టర్ చేసుకుందామా….

Leave a Comment

error: Content is protected !!