Is Tea Good Or Bad For The Health

మీకు టీ తాగే అలవాటు ఉందా?? ఒకసారి ఈ నిజాలు చూడండి.

కాఫీ టీ లు జీవితంలో చాలా లోతైన అలవాటు గా మారిపోయాయి. ఉదయం, సాయంత్రం టీ గొంతులో దిగకపోతే కుదురుగా ఉండలేరు. కొందరు టీ కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. రోజులో కనీసం నాలుగైదు సార్లు తాగనిది పని చేయలేరు, ఏకాగ్రత పెట్టలేరు,  ఇంతలా జీవితంలో భాగమైన టీ గూర్చి, టీ తాగడం వల్ల కలిగే లాభనష్టాల గూర్చి ఎవరైనా తెల్సుకుంటారా అంటే లేదే. నోటికి రుచి, శరీరానికి తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తోంది ఇంతకంటే ఏం కావాలి అనుకుంటారు చాలా మంది.  కానీ ఒక్క సారి టీ లాభనష్టాల గూర్చి చదవండి మీకే నిజం తెలుస్తుంది.

టీ వల్ల లాభాలు మరియు నష్టాలు

కేన్సర్ ను నిరోధించే గుణాలు టీ ఆకులకు ఉన్నాయన్నది చాలామంది చెప్పే మాట. టీ ఆకుల్లోని కెఫిన్ అనే పదార్థం ఉత్తేజదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో వేడిని పుట్టించి శక్తి ఉత్పత్తికి తోడ్పడే రసాయనాలు టీ లో పుష్కలంగా ఉంటాయి. పాలు, పంచదార వేయకుండా కేవలం టీ ఆకులతో కషాయం లాగా చేసుకుని తాగితే ( దీనినే బ్లాక్ టీ అంటారు) షుగర్ ఉన్న వారికి రక్తంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంచి మనసికొల్లాసాన్ని,  ఉత్తేజాన్ని కలిగించి, చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఆందోళనలు, మానసిక ఒత్తిడి కలిగించే కార్టిజాల్ అనే హార్మోన్ ను తగ్గించడం వల్ల  గుండెజబ్బు అవకాశాలు తగ్గిస్తుంది.

 అయితే ఎక్కువగా టీ తాగడం వల్ల ప్లోరైడ్ ఎక్కువగా శరీరంలోకి చేరుతుంది. కనీసం రోజుకు 4 నుండి 5 కప్పుల టీ వల్ల దాదాపు 300 మిల్లీ గ్రాముల కెఫిన్ శరీరంలోకి వెళుతుంది. టీ లో ఆగ్జలెట్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతాయి. వేడి వేడి టీ ని ఇష్టంగా అధికంగా తీసుకుంటే సోఫెగల్ కాన్సర్  అవకాశాలు పెరుగుతాయి.

     టీ లో పాలు కలిపి తీసుకునే అలవాటు మన దగ్గర మాత్రమే కనిపిస్తుంది. అయితే పైన చెప్పుకున్న బ్లాక్ టీ లో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కెటెచిన్ అనే విష రసాయనాలు మార్పు చెంది  శరీరానికి మేలు చేసే విధంగా తయారవుతాయి. అందుకే పాలు కలిపే టీ కన్నా బ్లాక్ టీని అందులో మితంగా తీసుకోవడం వల్ల తగిన ప్రయోజనాలు ఉంటాయి.

చివరగా……

జీవితంలో ఆరోగ్యం కావాలి అంటే ఏ అలవాటును వ్యసనంగా మార్చుకోకూడదు. ఇప్పట్లో టీ, మరియు కాఫీ ల విషయంలో చాలా మంది చేస్తున్న తప్పు అదే కాబట్టి అపుడపుడు తాగచ్చు కానీ అలవాటుగా మార్చుకోకండి

Leave a Comment

error: Content is protected !!