ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే మన ఆరోగ్యానికి మూలం. ఈ విషయం అందరికి తెలిసినదే. కూరగాయలు ఆకుకూరలు మనపాలిట గొప్ప కల్పతరువులు. ఈ విషయం అందరూ ఒప్పుకుని తీరవలసిందే. ఒకో రకం కూరగాయలో ఒకో అద్భుతం. అమ్మాయిల పెదవులను పోలుస్తూ సరదాగా ఆటపట్టించే కూరగాయ దొండకాయ. పచ్చిగా ఉన్నపుడు ఒక విధంగానూ, పండిపోయాక మరొక రుచి కలిగి ఉండే దొండకాయ లేతగా ఉన్నపుడు అద్భుతంగా ఉంటుంది. దొండకాయ ఉపయోగించి బోలెడు వంటలు వండుకుని తినడమే కాదు, గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంతకు ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒక్కసారి చూసేద్దాం.
జీర్ణ సమస్యలను తొలగిస్తుంది
ఆహారంలో దొండకాయ తీసుకోవడం వల్ల మలబద్ధకం సులువుగా తగ్గుతుంది. ఇందులోని డైటరీ ఫైబర్ దీనికి కారణమని చెప్పవచ్చు. ఇది జీర్ణశయ గోడలను పటిష్టంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఇందులోని ఫైబర్ చాలా ప్రభావవంతమైనది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో సమర్థవంతమైన పాత్రను పోషిస్తుంది.
మధుమేహానికి మంచిది
మధుమేహ వ్యాధిగ్రస్తులకు దొండకాయ చక్కని ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది కేవలం కూరగాయానే కాకుండా మధుమేహానికి గొప్ప ఔషధంగా కూడా పనిచేస్తుంది. సాధారణంగా ఫైబర్ ఉన్న పదార్థాలు మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచిది, అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే దొండకాయ పండ్లలో ఉండే గ్లూకోజ్ -6-ఫాస్ఫేటేస్ లను గ్రహించకుండా చేస్తుంది. ఇలా గ్లూకోజ్ గ్రహించకపోవడం వల్ల అది రక్తంలో కలవకుండా డయాబెటిస్ లేదా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
అలెర్జీలను దూరం ఉంచుతుంది
సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం వంటి వాటిలో ఇది ఔషధంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఆస్తమా మరియు బ్రోన్కైటిస్ వంటి కొన్ని శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే దొండకాయలోని సాపోనిన్, స్టెరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు మరియు గ్లైకోసైడ్లు గణనీయంగా ఉంటాయి. ఇవి ఉబ్బసం, మరియు అలర్జీ వంటి సమస్యలకు ఉత్తమం ఔషధంగా పనిచేస్తాయి.
క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది
యాంటీ-డయాబెటిక్ మరియు యాంటిహిస్టామినిక్ ప్రభావాలతో పాటు, యాంటీ ఇన్ప్లమెటరీ గా దొండకాయ పనిచేస్తుంది. క్రమం తప్పకుండా దొండకాయను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ ద్వారా శరీరానికి కలిగే నష్టం నుండి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా ముఖ్యంగా ఆరోగ్యవంతమైన కణజాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అంటువ్యాధులను ఎదుర్కొంటుంది
ఇది ఆహారంలో ఒక భాగమైన కూరగాయ అయినప్పటికీ కుష్ఠురోగం మరియు గజ్జి వంటి అంటు వ్యాధులు మరియు మొండి రోగాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ గునాలు చాలా ప్రభావవంతంగా పనిచేయడం వల్ల జబ్బును వ్యాప్తి చేసే బాక్టీరియను నిర్మూలించే సామర్థ్యము కలిగి ఉంటుంది. మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది.
చివరగా….
దొండకాయ అనేది రోజువారీ ఆహారంలో బాగమైనప్పటికి, వీటిని తాజాగా తీసుకోవడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.