Japanese secret to Grow Hair Rocket speed Fast

అందరూ వావ్ అనే జపనీస్ హెయిర్ గ్రోత్ సీక్రెట్

అందమైన పొడవైన జుట్టు అనగాని జపనీస్ స్త్రీల జుట్టు గుర్తుకువస్తుంది.  వారిలో అందరికీ జుట్టు చాలా పొడవుగా, మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. దీనికి వారు వాడే ఒక సీక్రెట్ రెసిపీ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ సీక్రెట్ జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు పొడవుగా పదిరెట్లు స్పీడుగా పెరిగేలా చేస్తుంది. దాని కోసం మనం ఒక కలబంద కొమ్మ తీసుకోవాలి. దాని నుండి పసుపురంగు ద్రవం బయటకు పోవడానికి ఒక పక్కన పెట్టుకోవాలి. 

తర్వాత దానిని శుభ్రంగా కడిగి పక్కన ఉండే ముళ్ళను తొలగించాలి. తరువాత కలబంద కొమ్మను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిని ఒక గిన్నె లో వేసి దానిలో రెండు చెంచాల చియా సీడ్స్ వేయాలి. బాగా  కడిగిన రెండు చెంచాల బియ్యం కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక గ్లాసు నీటిని వేసి  రాత్రంతా నానబెట్టి ఉంచాలి. మరుసటి రోజు ఉదయానికి చియా సీడ్స్ బియ్యం బాగా నానిపోతాయి. తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టి ఒక పల్చటి గుడ్డలో వడకట్టాలి.

 ఇలా వడకట్టుతో వడకట్టడం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత వడకట్టిన మిశ్రమాన్ని మరొకసారి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలి మెత్తగా ఉండాలి. బరకగ ఉండకుండా జాగ్రత్త పడాలి. తర్వాత ఒక స్పూన్ మయోనైజ్ వేయాలి. ఒక స్పూన్ కొబ్బరి నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి క్రీమీ టెక్చర్ కు వచ్చిన తరువాత తలకు పాయలుగా తీసుకుంటూ అప్లై చేయాలి. ఇలా జుట్టు మొత్తానికి అప్లై చేసిన తర్వాత 45 నిమిషాల పాటు వదిలేయాలి.

 ఇది జుట్టు పగుళ్లు, చివర్లు చిట్లడం సమస్యలు తగ్గి జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది. 45 నిమిషాల తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనిలో మయోన్నైస్ కు బదులు ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని మొదట మిశ్రమంతో కలిపి మిక్సీ పట్టాలి. అలాగే చియా సీడ్స్ కు బదులు అరటిపండు ఉపయోగించవచ్చు. ఇవన్నీ జుట్టుకు కావలసిన పోషకాలను అందించి జుట్టు మృదువుగా పొడవుగా పెరగడంలో సహాయపడతాయి. జుట్టు సమస్యలు తగ్గి అందమైన, పొడవైన జుట్టు పొందడానికి వారానికి ఒకసారి ఉపయోగించడం వలన మంచి రిజల్ట్స్ ఉంటాయి.

Leave a Comment

error: Content is protected !!