కాళ్లల్లో, కీళ్లల్లో వీపరీతంగా నొప్పులుతో బాధపడుతున్న వారు రకరకాల మందులు వాడుతూ ఉంటారు. వాటితో పాటు పాలతో ఇదొకటి కలిపి తీసుకోవడం వల్ల త్వరగా కీళ్ల నొప్పులు సమస్య నుండి బయట పడవచ్చు. అది ఏమిటి అనుకుంటున్నారా. గోంథ్ లేదా కటోరాలు అని చెప్పబడే దీనిని ఇంగ్లీషులో ఏడిబుల్ గమ్ అని కూడా పిలుస్తారు.
ఈ గోంథ్ ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చూడటానికి పటికబెల్లంలా కనిపిస్తాయి కానీ కాదు. వీటిని లడ్డూలు మరియు అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. బాలింతలకు ఇవ్వడం వల్ల శరీరం బలంగా, చనుబాలు సమృద్ధిగా తయారవుతాయి.
గోంథ్ ను మొదట నూనెలో వేయించాలి. తరువాత దీనిని మిక్సీలో కొంచెం పొడిలా చేసుకోవాలి. గోరువెచ్చని గ్లాసు పాలలో గోంథ్ ఒక స్పూన్ కలుపుకోవాలి. దీనిని ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే ఈ గోంథ్ పాలను పీల్చుకొని మెత్తగా తయారవుతుంది.
తర్వాత దీనిని పాలతో పాటు తీసుకోవడం వలన శరీరంలో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గి గుజ్జు తిరిగి ఏర్పడుతుంది. ఇది కీళ్లనొప్పులు, కీళ్ల మధ్య వాపు, సయాటికా, ఎలాంటి కండరాలూ, ఎముకల నొప్పి, నరాల నొప్పి వంటి సమస్యల చికిత్సలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలిగించకుండా సహాయపడుతుంది.
ఇది పురుషత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాలకు కూడా మంచిది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనితో పాటు ఈ రోజు రాత్రి మెంతులను నానబెట్టి ఉదయాన్నే నానబెట్టిన మెంతులు నమిలి తినేసి తరువాత నీటిని తాగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
మెంతులు యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా కీళ్ల నొప్పులను నయం చేయడానికి ప్రసిద్ధి చెందాయి. ఇది ఆర్థరైటిస్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతి గింజల పెట్రోలియం, ఈథర్ సారం గణనీయమైన శోథ నిరోధక చర్యలను కలిగి ఉంది, ఇవి లినోలెనిక్ మరియు లినోలెయిక్ ఆమ్లాల కారణంగా నొప్పులకు చికిత్స చేసే గుణాలను కలిగి ఉంటాయి.