joint pain remedy with phool makhani

4సార్లు తాగండి. రోజంతా ఉత్సాహంగా అలసట,నీరసం,నిస్సత్తువ, కీళ్ళు, కాళ్ళనొప్పులు, జాయింట్ పెయిన్స్, 100 ఏళ్ళు వచ్చినా హాయిగా..

ఇప్పటి రోజుల్లో మనుషులు చాలా బలహీనం గా ఉంటున్నారు చిన్న చిన్న పనులకు కూడా అలసిపోతున్నారు. ఇలాంటి వారు ఈ డ్రింక్ ఒక్క  మూడు రోజులపాటు తీసుకుంటే శరీరంలో నూతన ఉత్సాహం చేరి దానితో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. దాని కోసం మనం తీసుకోవాల్సింది ఒక గ్లాసెడు పాలు మరియు ఫూల్ మఖానా. తామర గింజలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఫూల్ మఖానా అంటే ఇప్పుడు సూపర్బజార్లో, ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉండడంతో అందరూ ఉపయోగిస్తున్నారు.

  ఇలా తీసుకుంటే శరీరంలో ఉండే నిస్సత్తువ, నీరసం తగ్గి బలంగా తయారవుతారు. ఒక కప్పు పాలలో వేసి మరిగించాలి. అందులోనే 1 స్పూన్ గసగసాలు కూడా వేయాలి. అందరూ గసగసాలను మసాలా దినుసులు గానే చూస్తారు. కానీ దీంట్లో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఇలా తాగడం వలన మంచి నిద్ర వస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, శ్వాససంబంధ సమస్యలు వంటి ఎన్నో సమస్యలను గసగసాలు తగ్గిస్తాయి.ఫూల్ మఖానాల్లో కొలెస్ట్రాల్, సోడియం మరియు సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి మరియు ఇవి మీ గుండెకు  చాలా మంచివి.  .

ఫూల్ మఖానా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరీరం బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు మంచి గా తోడ్పడుతుంది. ఇది యాంటీ ఏజింగ్ గా కూడా సహాయపడుతుంది. శరీరంపై మడతలు, మచ్చలను తొలగించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. దీనిలో ఒక స్పూన్ పటిక బెల్లం కలుపుకుని తాగవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు  పటికబెల్లం వదిలేసి నేరుగా తాగొచ్చు. ఇందులో ఉన్న ఫూల్ మఖానా నమిలి తినేయవచ్చు.

 ఇలా వారంలో కనీసం మూడు రోజులు చేయడం వల్ల శరీరంలో క్యాల్షియం, ఐరన్ శాతం పెరిగి ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలసట, నిస్సత్తువ, నీరసం తగ్గి ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు. అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. దీనికోసం కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!