joint pain treatment in telugu

పైసా ఖర్చు లేకుండా మోకాలి నొప్పులు పోవాలంటే ఇలా చేయండి

మనం ఏ పని చేసినా  మోకాళ్లపై భారం పడుతుంది. మోకాళ్ళు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం.  స్థూలకాయం, అధిక బరువు,   ఎగుడు దిగుడు  ప్రాంతాల్లో నడవడం వంటి కారణాల వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువగా బాధిస్తుంది. మనం విచక్షణారహితంగా భారం మోకాళ్ళ మీద వేస్తున్నాం. కొందరిలో మోకాళ్ళ నొప్పులు   వయసు వలన వస్తే కొందరిలో మోకాళ్ల  నొప్పులు  శరీరం అధిక బరువు వలన వస్తున్నాయి.  కలబంధతో  ఎలాంటి మోకాళ్ల నొప్పులు అయినా తగ్గించుకోవచ్చు. 

కలబందని ఎలా ఉపయోగించాలి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల దగ్గర నొప్పి, నడవడం, పరిగెత్తడం,  మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి రావడం ఉంటుంది.   వీటికీ మందులు వాడడం వలన తాత్కాలిక   ఉపశమనం మాత్రమే ఉంటుంది.  మందులు వాడటం వల్ల దీర్ఘకాలిక  సమస్యలకు దారి తీస్తాయి. అందుకే వ్యాయామం చేయడం వలన కొంతవరకు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నొప్పుల వలన ప్రశాంతంగా ఉండలేరు, ఏ పని చేసుకోలేరు అంతగా బాధిస్తాయి.  చిన్న చిన్న చిట్కాలు క్రమం తప్పకుండా పాటించినట్లయితే ఈ నొప్పులు  తగ్గించుకోవచ్చు. 

కలబందను తీసుకొని  దానిలో ఉండే జిగురును మోకాళ్ళపై అప్లై చేసినట్లయితే మోకాళ్ళ నొప్పులు త్వరగా తగ్గుతాయి.  రోజు ఉదయాన్నే ఒక స్పూన్ బొప్పాయి విత్తనాలు తీసుకోవడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. రాత్రి ఒక స్పూన్ మెంతులు నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున నమిలి తినడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం, పసుపు, నిమ్మకాయలు  కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాస్ నీటిలో చిన్న అల్లం ముక్క వేసుకొని అరచెంచా పసుపు వేసుకొని మరిగించి ఆ నీటిని   తేనె కలిపి తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. 

పసుపును పాలలో కలుపుకుని తాగడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఒక స్పూన్ పసుపు నీళ్ళతో కలిపి మోకాళ్ళ  పై అప్లై చేసినట్లయితే మోకాళ్ళ నొప్పులు  తగ్గుతాయి.  రోజూ మనం తీసుకునే ఆహారంలో నిమ్మకాయ ఉపయోగించుట వలన మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.  నువ్వుల నూనె  నిమ్మరసం సమభాగాలుగా తీసుకుని మోకాళ్ళ పై  మర్దన చేసినట్లయితే  మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే  అవిసె గింజలు, వాల్ నట్స్, బాదం, పొద్దుతిరుగుడు గింజలు,   చేపలు  తీసుకోవడం వల్ల కూడా  మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆవ నూనెతో మసాజ్ చేయడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈ చిట్కాలు పాటిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.  వీటితో పాటు  వ్యాయామం, మంచి  ఆహారం తీసుకోవడం  మంచిది. 

Leave a Comment

error: Content is protected !!