Juice for Hormonal Balance Irregular Periods Estrogen Hormones

15, 20 రూపాయలు పెట్టి ఈ మ్యాజికల్ జ్యూస్ తాగితే పీరియడ్స్ గంటకొట్టినట్టు కరెక్ట్ టైంకి వస్తాయి

స్త్రీలకి నెలనెల పీరియడ్స్ అవి సక్రమంగా వస్తే బాగుండు అని అందరూ కోరుకుంటారు. కానీ ఎక్కువ మంది ఈ రోజుల్లో సుమారు 60, 70 శాతం మందికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎప్పుడొస్తుందో తెలియదు. కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. ఫంక్షన్స్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కాస్త జాగ్రత్త పడతాము అంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్ వల్ల సమస్య వస్తుంది. కరెక్ట్ గా రావాలంటే మీరు మందులు వేస్తూ ఉంటారు. కానీ ఎంతకాలం మందులతో రప్పిస్తాం. మందులు అనేవి టెంపరరీ సొల్యూషన్. శరీరతత్వం మారాలి. దానికోసం అలవాట్లు మార్చుకోవాలి.

 స్త్రీ శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్  బ్యాలెన్స్ అవ్వాలి. అంటే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి చేసే డైట్ ఫాలో అవ్వాలి. అవి సోయా చిక్కుడు గింజలు. ఫైటో ఈస్ట్రోజెన్ సోయాలో ఎక్కువగా ఉంటుంది.అవి తినగానే ఇది మన శరీరంలోకి వెళ్లి ఈస్ట్రోజన్గా మారుతుంది. ఇది ఒక పరిశోధనలో కూడా ఋజువైంది. సోయా చిక్కుళ్ళు 43 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సోయాని పచ్చిగా ఎప్పుడు తినకూడదు. వండుకుని మాత్రమే తినాలి. సోయా బీన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ గోయాట్రిన్స్ వలన వస్తాయి. గోయాట్రిన్స్ అనేవి సోయాఉడికించినప్పుడు నశిస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సోయాను12 గంటలపాటు నానబెట్టి ఉడికించి తినడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

 రోజు ఆకుకూరలు కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి సోయా పాలు, మిల్ మేకర్ కూడా ఆహారంలో వాడవచ్చు. రోజూ మూడు పూట్ల వండినవి కాకుండా మధ్యాహ్నం వండిన ఆహారం ఉదయం, సాయంత్రం పండ్లు, కూరగాయలు తీసుకోవడం వలన హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. ఇలా తీసుకోవడం వల్ల రెండు, మూడు నెలల్లోనే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. ఉదయాన్నే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదా కూరగాయల జ్యూస్ తాగండి. తర్వాత కొన్ని మొలకలు తీసుకోండి. ఇందులో కనీసం రెండు, మూడు రకాల గింజలు అయినా ఉండాలి. 

రోజు కనీసం ఏదో ఒక రకం మొలకలను తీసుకుంటూ ఉండాలి. సాయంత్రం పూట ఒక గ్లాస్ చెరుకు రసం లేదా ఒక గ్లాసు బత్తాయి రసం తీసుకోండి. పంచదార లేకుండా  ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం భోజనం కింద రెండు జామ పళ్ళు,  రెండు అరటి పళ్ళు ఏవైనా రెండు రకాల ఫ్రూట్స్ని కడుపునిండా తీసుకోండి. మందులు ఎప్పుడూ తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. సహజంగా లభించే పదార్థాలు శాశ్వత పరిష్కారాలు ఇస్తాయి. తాజా పండ్లు కూరగాయలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి.

Leave a Comment

error: Content is protected !!