Karakkaya Harad amazing health benefits

గుప్పెట్లో దాగిపోయే మాయాజాలం…..

డబ్బుతో ఏదైనా కొనగలం అనుకుంటాం కానీ కొనలేనివి కూడా చాలానే ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఆరోగ్యం. మనిషికి జబ్బు చేయగానే హాస్పిటల్స్ వెంట, మెడికల్ షాపుల వెంట తిరిగి తనలో ఉన్న రోగనిరోధక శక్తిని రోజురోజుకు చంపేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఈ ప్రకృతి, మానవ జీవితం రెండు ఎంతో సామీప్యంగా ఉండేవి, కానీ మనిషి అభివృద్ధి పేరిట ఎప్పుడైతే పాశ్చాత్య సంస్కృతి వెంట పడుతూ అవే తన అలవాట్లుగా మార్చుకున్నాడో అప్పటినుండే జబ్బుల దిబ్బ గా తయారు అవుతున్నాడు.

                ప్రకృతి పరంగా మనిషికి లభించే పంచభూతాల వరప్రసాదం ఆయుర్వేదం, తరతరాలుగా మన పూర్వీకులు అనుసరించిన బాట బంగారు బాట. దాన్ని మరిచి అల్లోపతి వెంట పడి శరీరాన్ని రోగాల పుట్టగా తయారుచేస్తున్నాం ఏమో కదా!!

         మనిషిని బాధించే సమస్య అజీర్ణం. ఉద్యోగాల టెన్షన్ లో పడి వేళ కాని వేళ లో చేసే భోజనం అజీర్తి సమస్యకు కారణమవుతుంది. అలాగే పనుల వత్తిడి వల్ల భోజనాన్ని ఎగ్గొట్టి ఏ బిస్కెట్టులతోనో, బ్రెడ్డు ముక్కలతోనో కడుపును రామ్ రామ్ అనిపించి తరువాత బిర్యానీలు, మసాలా దట్టించిన పదార్థాలు ఒక్కసారిగా ఎక్కువ తినేయడం కూడా అజీర్తి కి కారణం అవుతుంది. జీవితంలో ఇంత సంపాదిస్తూ ఏం లాభం దాన్ని ఆస్వాదించడానికి చక్కని ఆరోగ్యం కూడా ఉండాలి కదా అజీర్తికి చక్కని చిట్కా……

                   కరక్కాయ….. త్రిఫలములలో కరక్కాయ ఒకటి. గుప్పెట్లో పెట్టుకుంటే దాగిపోయే కరక్కాయ మాయాజాలం మాటల్లో వర్ణించలేనిది. చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా కరక్కాయ విరివిగా లభ్యమవుతుంది. డాక్టర్ కన్సల్టెషన్ ఫీజు, మందుల వెల కంటే తక్కువ ధరలో కరక్కాయను పొందొచ్చు. 

కరక్కాయ  బెరడు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని సమభాగాలువా తీసుకుని రెండింటిని కలిపి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూటకు మూడు గ్రాముల చెప్పున రెండు పూటలా భోజనం చేసిన తరువాత నోట్లో వేసుకుని చప్పరించాలి. ఇలా చేస్తూ ఉంటే అజీర్తికి సంబంధించిన అన్ని సమస్యలు ఫటాఫట్ అయిపోతాయి. 

      అలాగే అజీర్తి తగ్గించుకోగానే మనం బాగయిపోయినట్టు కాదు తరువాత మళ్ళీ ఆ సమస్య రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే పీచు పదార్థాలు కూడా మనం తీసుకునే ఆహారం లో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పరగడుపున వేడి నీటితో మన రోజును మొదలుపెట్టి తీసుకునే ఆహారాన్ని తక్కువ మోతాదులో రోజుకు నాలుగు అయిదు సార్లు విభజించుకోవాలి. దీని వల్ల ఆహారం సక్రమంగా జీర్ణమవడమే కాకుండా ఫ్యాట్ పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ సేపు కూర్చునే పని చేసేటపుడు కనీసం గంటకు ఒకసారి లేచి నాలుగడుగులు వేయడం వల్ల కుచించుకుపోయిన జీర్ణాశయం కాసింత వదులుగా అవుతుంది.

చివరిగా…       

అజీర్తికి ఆహార అలవాట్లకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఇప్పటికే అందరికి అర్థమైంది కదా అందుకే నాలుకకు ఏం కావాలో కాదు కడుపుకు ఏమి కావాలి తెలుసుకుని తినడం వల్ల అజీర్తితో పాటు అది వెంట పెట్టుకువచ్చే ఎన్నో రోగాలకు చెక్ పెట్టవచ్చు. డైజిన్ టాబ్లెట్లు, ఫ్రూట్ సాల్ట్ లు నీళ్లలో కలుపుకుని తాగి తక్షణ ఉపశమనం తో ఎన్నాళ్ళని గడిపేస్తాం?? శాశ్వత పరిష్కారం కావాలంటే కరక్కాయను వాడాలంతే!!

Leave a Comment

error: Content is protected !!