kerala herbal hair oil preparation

కేరళ వాళ్ల హెయిర్ సీక్రెట్ ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి మనం కూడా తెలుసుకుందాం

కేరళ వల్ల జుట్టు చాలా నల్లగా పొడవుగా ఉంటుంది వాళ్ల చుట్టూ చూస్తుంటే ఆ సీక్రెట్ ఏంటో  మనం కూడా తెలుసుకుని ట్రై చేయాలని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు  రెగ్యులర్ గా తలకు రాసుకునే నూనె వల్ల వాళ్ళ  జుట్టు నల్లగా, పొడవుగా, ఒత్తుగా ఉంటుంది. ఈ నూనె ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం.   స్టవ్ మీద దళసరిగా ఉండే ఒక కడాయి పెట్టుకోవాలి. దానిలో రెండు కప్పులు స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసుకోవాలి.

దాన్లో పావుకప్పు కలబంద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి.  గుప్పెడు మందార ఆకులు, ఒక గుప్పుడు కరివేపాకు, ఒక గుప్పెడు గోరింటాకు వెయ్యాలి.  రెండు వందల గ్రాముల అల్లం మిక్సీ పట్టుకుని అందులో వేయాలి.  కేరళలో  అల్లం నూనె దొరుకుతుందట  మనకు దొరకదు కాబట్టి అల్లం పేస్ట్ ని వేసుకోవాలి. ఒక 15  ఉసిరికాయలను  బరకగా పేస్ట్ చేసుకొని దీంట్లో వెయ్యాలి.  రెండు చెంచాల లవంగాలు కూడా వెయ్యాలి. దీనికి రెండు చెంచాల మెంతులు కూడా వేసుకోవాలి.

రెండు పెద్ద సైజు వి ఎర్ర ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసి వాటిని కొని నూనె వేసుకోవాలి. ఒక గుప్పెడు గుమ్మడి గింజలను కూడా నూనె వేసి బాగా మరిగించాలి. గుమ్మడి గింజలు ఆయుర్వేదం స్టోర్స్ లోనూ, కిరాణా స్టోర్ లో కూడా దొరుకుతాయి. ఈ నూనెలో గుమ్మడి గింజలు కంపల్సరిగా వేసుకోవాలి. లాస్ట్ గా దీన్ని ఒక గుప్పెడు రేఖ మందారం పూలు కూడా వేసుకోవాలి. తర్వాత నూనె  అన్ని నలుపు రంగులోకి మారేంత వరకు బాగా మరిగించాలి. నూనె నలుపు రంగులోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి  నూనె చల్లారబెట్టుకోవాలి.

చల్లారిన తర్వాత నూనె గుడ్డలో పోసి వడకట్టుకోవాలి. నూనె బ్లాక్ కలర్ లో ఉంటుంది నూనె రాయడం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా నల్లగా తయారవుతుంది ఈ నూనె  రాసిన వెంటనే తలస్నానం చేయకూడదు రెగ్యులర్ గా రోజు విడిచి రోజు అప్లై చేసుకోవాలి. నూనె అప్లై చేసిన తర్వాత తలస్నానం  ఏదైనా హెర్బల్ లేదా మైల్డ్ షాంపూతో చేయాలి. కెమికల్స్ ఉన్న షాంపూ వాడటం వలన జుట్టుకు అనేక సమస్యలు వస్తాయి ఎప్పుడు తలకు కెమికల్ ఫ్రీ  షాంపూలు వాడాలి. నూనె రాయడం వలన మన జుట్టు కూడా కేరళ వాళ్ళ  జుట్టు లాగా నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!