Kidney Disease Symptoms In Telugu

ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయేమో చూసుకోండి!! లేకపోతే మీ కిడ్నీ ల ఆరోగ్యం గోవిందా!!

శరీరంలో రక్తాన్ని వడపోత చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీల పాత్ర అనిర్వచనీయమైనది. చిన్నచిన్న మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపడంలో కూడా మూత్రపిండాల పాత్ర ఉంది. రోజు మనం తాగే నీటిలో వ్యర్థాలు, అధిక లవణాలు వంటివి మూత్రం ద్వారా బయటకు వెళ్లి వెసులుబాటు లేకుంటే ఏమవుతుంది ఒక్కసారి ఊహించుకోండి. కేవలం ఊహే చాలా భయంకరంగా ఉంటుంది కదా మరి కిడ్నీ సమస్యలు వచ్చి అది పెరిగి చివరకు కిడ్నీ తీసేయాల్సిన పరిస్థితి వస్తే ఉహను నిజంగా భరించాల్సి ఉంటుంది. అలనయి కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడానికి మన శరీరం లో మనకు కనిపించే కొన్ని లక్షణాలు ఇవిగో. వీటిని చదివి మికేదైన అలాంటి సమస్యలు ఉంటే కిడ్నీ విషయంలో జాగ్రత్త పడండి మరి.

◆ ఎక్కువ అలసిపోవడం, తక్కువ శక్తిని కలిగి ఉండటం లేదా ఏకాగ్రత దెబ్బతినడం వంటి సమస్యలు ఉన్నా,  మూత్రపిండాల పనితీరు బాగా మందగించడం వల్ల రక్తంలో టాక్సిన్స్ మరియు మలినాలు ఏర్పడి అవి పెరిగిపోతాయి. అలా అవడం వల్ల అలసటతో, బలహీనంగా అనిపించేలా చేస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళలో కనిపించే  మరొక సమస్య రక్తహీనత, ఇది మనిషిని మరింత బలహీనంగా మార్చేస్తుంది.  

◆ నిద్రకు ఇబ్బందిగా అనిపించడం మూత్రపిండాల పనుతీరు దారితప్పిందనడానికి ఒక సంకేతం.   మూత్రపిండాలు మూత్రాన్ని సరిగా ఫిల్టర్ చేయనప్పుడు, టాక్సిన్ లు మూత్రం ద్వారా బయటకు వెళ్లకుండా  రక్తంలో నిలిచిపోతాయి.  దీనివల్ల నిద్రపోవడం కష్టమవుతుంది.  అలాగే ఉబకాయం మరియు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి మధ్య కూడా సంభవించే అవకాశం ఉంటుంది.  దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారిలో స్లీప్ అప్నియా ఎక్కువగా కనిపిస్తుంది.

◆  పొడి చర్మం ఉండటం మరొక సమస్య.   శరీరం నుండి వ్యర్ధాలను మరియు శరీరానికి అక్కర్లేని ద్రవాన్ని బయటకు పంపుతాయి మరియు  ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడతాయి, ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి మరియు మీ రక్తంలో సరైన ఖనిజాలు సమతుల్యంగా ఉండేలా చేస్తాయి. 

◆ అతి మూత్ర సమస్య. మాటిమాటికి బాత్రూమ్ వెళ్లాలని అనిపించడం. ఈ సమస్య ఉంటే మాత్రం కిడ్నీ సమస్యలు మీ వెంట వస్తున్నాయని తప్పక గుర్తించాలి.   ముఖ్యంగా రాత్రి సమయంలో ఇలా జరుగుతూ ఉంటే దానివల్ల నిద్ర కూడా సరిగా ఉండక ఆరోగ్యం క్రమంగా మందగిస్తుంది. ఇలా అతి మూత్రం కొన్నిసార్లు మూత్రశయ ఇన్ఫెక్షన్ లకు దారితీసే అవకాశం ఉంటుంది. 

◆  మూత్రంలో రక్తం పడటం చాలా ప్రమాదకరమైన సంకేతం.  రక్తం నుండి వ్యర్ధాలను ఫిల్టర్ చేసేటప్పుడు ఆరోగ్యకరమైన మూత్రపిండాలు సాధారణంగా రక్తాన్ని మలినాలను వేరు చేసి మలినాలను బయటకు పంపుతాయి. కానీ మూత్రపిండాల ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు, ఈ రక్త కణాలు మూత్రంలోకి “లీక్” అవ్వడం ప్రారంభిస్తాయి.  

◆  మూత్రం నురుగుగా ఉండటం.  మూత్రంలో అధిక బుడగలు – ఇలాంటివి ఉండటం వల్ల శరీరానికి ప్రోటీన్ ను అందించలేక మూత్రం ద్వారా వెళ్లిపోవడం జరుగుతుంది.  

◆  కళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉబ్బినట్లు ఉండటం.  మూత్రపిండాల ఫిల్టర్లు దెబ్బతిన్నట్లు సంకేతం, మూత్రంలో ప్రోటీన్ లీక్ అయ్యేలా చేస్తుంది.  శరీరంలో ప్రోటీన్ లీక్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది.

◆  చీలమండలు, కాళ్ళు వాపు.  మూత్రపిండాల పనితీరు తగ్గడం సోడియం బయటకు వెళ్లకుండా ఆగిపోవడం కారణం అవుతుంది.  పాదాలు మరియు చీలమండలలో వాపు వస్తుంది.  గుండె జబ్బులు, కాలేయ వ్యాధి మరియు దీర్ఘకాలిక సిరల సమస్యలు ఎదురవ్వవచ్చు.

◆  ఆకలి తక్కువగా ఉండటం మరొక సంకేతం..  ఇది చాలా సాధారణ లక్షణం, కానీ మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల శరీరంలో టాక్సిన్ లు చాలా పేరుకుపోతాయి. 

◆  కండరాలు తిమ్మిరిగా ఉండటం.  మూత్రపిండాల పనితీరు మందగించడం  వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది.  ఉదాహరణకు, తక్కువ కాల్షియం ఉండటం మరియు  భాస్వరం ను నియంత్రించలేకపోవడం కండరాల తిమ్మిరికి కారణమవుతాయి.

చివరగా….

మూత్రపిండాలకు ఏదన్నా ప్రమాదం ఉంటే పైన చెప్పుకున్నా లక్షణాలు అన్ని కానీ లేదా వాటిలో కొన్ని కానీ కనబడుతూ ఉంటాయి ఒక్కసారి మిమ్మని మీరు పరిశీలించుకుని మీ కిడ్నీలను పది కాలాల పాటు కాపాడుకోండి.

Leave a Comment

error: Content is protected !!