శరీరంలో మనం తినే ఆహారాన్ని బట్టి వాటిని విచ్ఛిన్నం చేయడానికి శరీరంలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. నాన్వెజ్ ఎక్కువగా తినేవారిలో ఈ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అయి శరీరంలో పేరుకుపోతాయి. కిడ్నీలు యాసిడ్లను ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపుతాయి. కానీ అధికంగా యాసిడ్స్ రిలీజ్ అయ్యే వారిలో నీటిని తక్కువగా తాగడం వలన యూరిన్ లో మంట, నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ఎక్కువకాలం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీల ఫెయిల్యూర్, ఇతర అంతర్గత అవయవాల నష్టానికి దారి తీస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అవ్వకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం చాలా అవసరం.
మసాలాలు లేని రాత్రులు సాత్విక ఆహారం తీసుకుంటూ త్వరగా జీర్ణమయ్యేవి ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజుకి రెండు, మూడు లీటర్ల నీటిని తాగడం తప్పనిసరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మూత్రానికి వెళ్లడం వలన యాసిడ్స్ బయటకు వెళ్లిపోతాయి. నెలలో కనీసం మూడు రోజులు తేనె నీళ్లు ఉపవాసం చేసేవారు ఈ యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గించుకోవడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ప్రతి గంటకు ఒక గ్లాసు తేనె, నిమ్మరసం కలిపిన నీరు తాగుతూ ఉండాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఒక గ్లాసు మామూలు నీటిని తాగాలి. ఎప్పటికప్పడు మూత్రానికి వెళుతూ ఉండాలి. ఇలా తేనె కలిపిన నీరు ఉపవాసం చేయడం వలన శరీరంలో పేరుకొన్న టాక్సిన్స్, ఆహారం ద్వారా శరీరంలో చేరిన ఎరువులు, పురుగుల మందుల అవశేషాలు బయటకు వెళ్లిపోతాయి.
అంతర్గత అవయవాలను ముఖ్యంగా లివర్, కిడ్నీలను పరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇలా కనీసం ఐదారు రోజులపాటు తేనె ఉపవాసం చేయడం వలన 3 నుండి 4 కేజీల బరువు తగ్గుతారు. దీనితో పాటు ఎనీమా చేయించుకోవడం వలన పొట్టలోని మలినాలు, నులిపురుగుల వంటివి పూర్తిగా శుభ్రపడతాయి. మనం ఏ ఆహారం తీసుకోవడం లేదు కనుక శరీరంలో కొత్తగా అవశేషాలు తయారవవు. అందుకే ఈ సమయంలోనే ఎనీమా చేసుకోవడం వలన ప్రేగులలో పేరుకున్న మలం, యూరిక్ యాసిడ్ వంటివి పూర్తిగా శుభ్రపడతాయి.