ప్రస్తుత కాలంలో నూటికి 50% మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. హాస్పిటల్స్ చుట్టూ కిడ్నీ సమస్యలతో తిరిగి సమయం మరియు డబ్బు కూడా వృధా చేసుకుంటున్నారు. ముందుగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ కిడ్నీలు పదిలంగా ఉంటుంది. నెలకి ఒకసారి ఈ డ్రింక్ తయారుచేసుకుని తాగినట్లయితే కిడ్నీలు శుభ్రం ఐపొతాయి.దీనికోసం ముందుగా మనం ఒక చెంచా ధనియాలు తీసుకుని రోటిలో కచ్చబచ్చాగా దంచుకోవాలి.
ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దంచుకున్న ధనియాలు, ఒక చెంచా జీలకర్ర వేసి రెండు గంటలపాటు నానబెట్టాలి. ధనియాలు గ్యాస్ అసిడిటీ అజీర్తి వంటి సమస్యలు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కిడ్నీలను శుభ్రం చేయడంలో కూడా ధనియాలు చాలా బాగా సహాయపడుతాయి. అలాగే జీలకర్ర కూడా శరీరంలో గ్యాస్ అసిడిటీ అజీర్తి సమస్యలు అధిక బరువును తగ్గించడంలో చెడు కొలెస్ట్రాల్ అను తగ్గించడంలో జీలకర్ర చాలా బాగా పనిచేస్తుంది.
రెండు గంటలు నానిన తరువాత ఈ నీటిని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించి పోవాలి. తర్వాత ఒక నిమ్మకాయల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరొక ఐదు నిమిషాల పాటు మరిగించి కోవాలి. తర్వాత ఈ నీటిని వడకట్టుకుని రుచి కోసం చెంచా తేనె కలుపుకొని తాగాలి.షుగర్ ఉన్నవారు ఐతే తేనె వేసుకోకూడదు. ఒక చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న డ్రింక్ ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.
ఉదయాన్నే సమయం లేదు అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం భోజనం తర్వాత తాగాలి. ఈ డ్రింక్ ప్రతిరోజు తాగాల్సిన అవసరం కూడా లేదు. నెలకి ఒకసారి తాగినట్లయితే కిడ్నీలు మొత్తం క్లీన్ ఐపోతాయి. ఈ డ్రింక్ తాగడం వలన కిడ్నీలు క్లీన్ అవ్వడమే కాకుండా పొట్టలో స్టాక్ ఉండిపోయిన మలం కూడా బయటకి వచ్చేస్తుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. ఈ డ్రింక్ పొట్ట మరియు ప్రేగులు కూడా శుభ్రం చేయడంలో ఉపయోగపడుతుంది.
ఈ డ్రింక్ వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు తాగవచ్చు. ఈ డ్రింక్ తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కాకుండా లేని వారికి కూడా ఈ డ్రింక్ బాగా పనిచేస్తుంది. ఈ చిట్కా మీకు కూడా అవసరం అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. మంచి రిసల్ట్ ఉంటుంది.