కిడ్నీలో స్టోన్స్ అంటే క్యాల్షియం ఆక్సలైట్ క్రిస్టల్స్ అని అంటాం. ఈమధ్య ఇవి ఒక పెద్ద సమస్యగా మారాయి. ఇప్పుడు ఇవి ఎలా తయారవుతాయి, ఎందుకు తయారవుతాయి అనే దాని గురించి అవగాహన చేసుకుందాం. మన శరీరం కొన్ని ప్రొడక్ట్స్ ను తయారు చేసుకుంటుంది. వీటిని తయారు చేసుకునేటప్పుడు ఎండ్ ప్రొడక్ట్స్ గా ఆక్సలైట్స్ ఉత్పత్తి అవుతాయి. వీటిని ఎప్పటికప్పుడు శరీరం క్లీన్ చేస్తూ బయటకు పంపించాలి. ఇలా శరీరంలో విడుదలైన ఆక్సలైట్స్ ను లివర్ కొంచెం విచ్చిన్నం చేస్తుంది. ఇంకా కొన్ని ఆక్సలైట్స్ కిడ్నీకి వెళ్తాయి. వాటిని కిడ్నీలు విడగొట్టి యూరిన్ ద్వారా బయటికి పంపిస్తాయి.
ఈ విధంగా విడుదలైన ఆక్సలైట్స్ అన్ని ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటికి వెళ్లిపోతే స్టోన్స్ అనేవి ఏర్పడవు. చాలామందిలో మంచినీళ్లు తక్కువగా తాగడం వలన యూరిన్ ఫార్మేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అందువలన యూరిన్ ద్వారా పోవాల్సిన ఆక్సలైట్స్ బయటికి పోకుండా రక్తంలోనే ఉండిపొతాయి. ఇలా రక్తంలో ఉండిపోయిన ఆక్సలైట్స్ క్యాల్షియంతో కలిసి క్యాల్షియం ఆక్సలైట్ స్టోన్స్ గా ఏర్పడతాయి. ఇవి ఎక్కువ అయితే క్యాల్షియం గ్రహించడం కూడా తగ్గించబడుతుంది. వీటి వలన ఇలాంటి నష్టం కూడా వస్తుంది.
పేగులలో విడుదలయ్యే కొన్ని ఆక్సలైట్స్ మలం ద్వారా కూడా బయటకు వెళ్లిపోతాయి. అందువలన మంచినీళ్లు ఎక్కువగా తాగడం, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆక్సలైట్స్ మోషన్ ద్వారా బయటకు పోతాయి. కనుక మంచినీళ్లు ఎక్కువగా తాగకపోవడం వలన స్టోన్స్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. శరీరంలో తయారైనవి ఈ విధంగా పోతాయి. ఇది మొదటి కారణం. రెండవదిగా చూసుకుంటే బయటి నుంచి ఆహారం ద్వారా కూడా ఆక్సలైట్స్ వెళ్తాయి. అన్నిటికంటే ఎక్కువగా ఆకుకూరలలో ఆక్సలైట్స్ ఉంటాయి.
పాలకూర వంటి వాటిలో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆహారాన్ని వండుకొని తింటే దగ్గర దగ్గర 70% ఆక్సలైట్స్ నశించిపోతాయి. ఇవి ఎక్కువగా టమాటల్లోనూ, పాలకూరలోనే ఉంటాయి. వేడి చేసి వీటిని తింటూ ఉంటాం కనుక వీటి వలన ఏం నష్టం ఉండదు. వీటితో కాకుండా కొన్ని డార్క్ చాక్లెట్, కొన్ని రకాల కూల్డ్రింక్స్ తాగినప్పుడు వాటిలో ఆక్సలైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి బయటకు రాకపోతే స్టోన్స్ కింద ఏర్పడతాయి. అంటే బయట నుంచి వచ్చే ఆక్సలైట్స్ స్టోన్స్ కింద తయారవ్వకుండా ఉండాలి అంటే మంచినీటిని రోజుకు నాలుగైదు లీటర్లు తాగడం వంటి మంచి అలవాటు చేసుకుంటే కిడ్నీలో స్టోన్స్ రాకుండా తగ్గించుకోవచ్చు…