Kidney Stones patients to avoid these foods

కిడ్నీ లో రాళ్లు ఏర్పడకుండా తీసుకోవలసిన ఆహారం.

కిడ్నీలో రాళ్లు తరచుగా వింటూ ఉంటాం. ఈ నొప్పి భరించలేనిది, తీసుకునే ఆహారం ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.  కిడ్నీలో  రాళ్ళు ఏర్పడకుండా ఉండటానికి ఏ ఆహారం తీసుకోవడం ఉత్తమం అనేది చాలా మందికి తెలియదు. అలాంటివారు కింది సూచించబడిన ఆహారపదార్థాలను భాగం చేసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. 

 ◆ నీరు బాగా తాగాలి.

 సగటు వ్యక్తి రోజుకు 12-16 కప్పుల నీరు త్రాగాలి. అంటే కనీసం 4 లీటర్ల వరకు తాగడం తప్పనిసరి. దీనివల్ల శరీరంలో మలినాలు మూత్రం రూపంలో సమర్థవంతంగా విసర్జింపబడతాయి. అదే నీటిని తక్కువగా తాగే వారిలో కాస్త బరువైన మలినాలు బయటకు వెళ్లలేక అవి అలాగే పేరుకుపోయి రాయగా మరే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు బాగా తాగడం మొదటి జాగ్రత్త. 

◆ ఆహారంలో  తక్కువ ఉప్పు తీసుకోవాలి.

చాలందికి ఉప్పు ఎక్కువగా తినడం అలవాటు. దేంట్లోనూ ఉప్పు లేకుండా తినలేరు. అయితే ఇలా తీసుకునే అధిక స్థాయి ఉప్పు వల్ల  కాల్షియం స్థాయిని పెంచుతుంది మరియు మూత్రంలో సిట్రేట్‌ను తగ్గిస్తుంది – రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఉప్పు మరియు కాల్షియం శరీరానికి అవసరమైన మోతాదులోనే తీసుకోవాలి.

 ◆ పండ్లు మరియు కూరగాయలు తాజా ఆహారాన్ని తీసుకోవాలి. 

 ఇది సాధారణంగా ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన జాగ్రత్త కానీ మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉన్నవారికి, మరియు రాళ్లు ఏర్పడి ఇబ్బంది పడుతున్నవారికి ఇది చాలా ముఖ్యమైనది. తాజా కూరల్లో స్వచ్ఛమైన మరియు సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. ఇవి గొప్ప  మేలు చేకూర్చుతాయి. ప్యాకింగ్ చేయబడ్డ ఆహారానికి దూరం ఉండాలి.

◆ మాంసాహారం తగ్గించాలి

 మాంసం అధికంగా  తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్, కాల్షియం మరియు ఆక్సలేట్ సాంద్రతలు మూత్రంలో పెరుగుతాయి, ఇవన్నీ రాయి ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. ఏవిధమైన మాంసం అయినా వీలైనంత పరిమితిలో ఉండటం శ్రేయస్కరం.

◆ సహజమైన కాల్షియం గల ఆహారం తీసుకోవడం

 అధిక కాల్షియం ఆహారాలు శరీరానికి అవసరమైనప్పుడు  సహజమైన మరియు తాజా పాలు వంటివి  తీసుకోవడం వల్ల కాల్షియం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం తప్పుతుంది. శరీరంలో కాల్షియం కోసం కాల్షియం సప్లిమెంట్లు వాడటం కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. 

 ◆సిట్రస్ పండ్లు తీసుకోవడం అత్యుత్తమం

  ఆహారాలలో సిట్రట్ కాల్షియంను బంధించడం ద్వారా రాళ్లు ఏర్పడటాన్ని అడ్డుకుంటుంది. అలాగే ఆక్సలేట్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కాల్షియం బంధించబడదు దీనివల్ల రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఎక్కువ.  నిమ్మకాయ మరియు సున్నం సిట్రేట్ యొక్క ఉత్తమ వనరులు, తరువాత నారింజ మరియు ద్రాక్షపండ్లు ఇలా చాలా చెప్పుకోవచ్చు.

 ఆక్సలేట్  అధికంగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించుకోవాలి.

 ఆక్సలేట్ అనేది సహజంగా లభించే పదార్థం, ఇది అనేక రకాలైన ఆహారాలలో లభిస్తుంది.  ఉదాహరణలు:

 బచ్చలికూర మరియు ఇతర ఆకుకూరలు

 బెర్రీలు

 రబర్బ్

 దుంపలు

 చాక్లెట్

 ఫ్రెంచ్ ఫ్రైస్

 గింజలు 

 సోయా ఉత్పత్తులు

చివరగా……

కిడ్నీ లో రాళ్లు ఏర్పడటం కొంతమందిలో వంశపర్యపరం అని అంటుంటారు అలాంటి వాళ్ళు ఆహార అలవగలే వాటికి కారణం అని గ్రహించి  ఈ ఆహార జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!