kidney stones remedies

కొబ్బరి నీళ్లలో ఇది కలిపి తాగితే కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి

కిడ్నీలో రాళ్ల తో బాధపడేవారు పూర్వకాలంలో ఎటువంటి మందులు లేకుండానే వాటిని తగ్గించుకునేవారు. కానీ నేటి కాలంలో ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది. కానీ తిరిగి రాళ్లు రాకుండా ఆపలేం. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే సహజ పదార్థాలు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లను కరిగించి తిరిగి శాశ్వతంగా రాకుండా అడ్డుకోవచ్చు.  దీనికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చెప్పిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం. రణపాల మొక్క గురించి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం.

 ఈ మొక్క ఆకులు నలిపి యాభై గ్రాముల రసంలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు కరిగించుకోవచ్చు. అలాగే కొండ పిండి ఆకు కూడా కిడ్నీలో రాళ్లను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్కను వేర్లతో సహా తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక లీటర్ నీటిలో వేసి పావు లీటర్ అయ్యేంతవరకు మరిగించి ఈ నీటిని తాగడం వలన కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. అలాగే అరటి దువ్వ గురించి వినే ఉంటాం. దీనితో కూరలు చేసుకొని తినేవారని చెబుతూ ఉంటారు. ఇలా చేసుకొని తినడం వలన కిడ్నీ వ్యాధులు రాకుండా రాళ్లను కూడా కరిగించుకోవచ్చు. ఈ అరటి దువ్వను దంచి దీని నుండి రసం తీసి ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాసు తాగడం వలన మనం పొందవచ్చు. 

అలాగే పల్లేరు కాయలు మొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి దానిని కషాయంగా మరిగించి తీసుకోవడం వలన కూడా కిడ్నీలో రాళ్లు పూర్తిగా తొలగించుకోవచ్చు. అయితే చాలా మందికి అందుబాటులో ఉండవు గనుక ఆయుర్వేద షాపులో దొరికే పెట్లుప్పు అనబడే ఆయుర్వేద పదార్థాన్ని తీసుకోవాలి. అలాగే వెలిగారం, పటిక తీసుకొని పొడి చేసుకోవాలి. దీనితోపాటు కలమంద, కుమారి అని పిలువబడే దుంప యొక్క రసాన్ని తీసుకుని దానితో వీటిని దంచి దీనితోపాటు ఒక కుండలో పెట్టి పిడకలతో కాల్చి బస్మం పొడిలా చేసుకోవాలి.

 ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక కొబ్బరికాయ నీటిలో రెండు గ్రాముల చొప్పున వేసుకొని ప్రతిరోజు సేవించడం వలన కిడ్నీలో రాళ్లు ఎంత పెద్ద సైజులో ఉన్నా పడిపోతాయి. రాళ్ల సైజు పెద్దగా ఉంటే 21 రోజులు చిన్నగా ఉంటే 7 రోజులు మాత్రమే ఈ మందు వాడాలి. దీనితో పాటు నీటిని ఎక్కువగా తాగడం జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలి. అలాగే అరటి దూట కూర వారంలో కనీసం ఒక్కసారైనా తీసుకునేలా చూసుకోవాలి.

Leave a Comment

error: Content is protected !!