మొదటిది వేరుశనగ పప్పులు, రెండవది పచ్చి కొబ్బరి, మూడవది పుచ్చ గింజల పప్పు, నాలుగవది గుమ్మడి గింజల పప్పు, ఐదవది పొద్దు తిరుగుడు పప్పు. ఈ ఐదు రకాల విత్తనాలను బలం రావడం కోసం ఉపయోగించవచ్చు. ఈ పంచరత్నాలని ఎలా వాడుకోవాలి అంటే రోజులో ఒక ఆహారం లా తినే ప్రయత్నం చేయాలి. కొబ్బరి ముక్కలను కొట్టి పెట్టుకోండి లేదా తురిమి పెట్టుకుని ఈజీగా తినాలంటే కొంచెం బెల్లం ముక్క పెట్టుకుని కొబ్బరి తురుము నంచుకుంటూ తినేస్తే చాలా బలం వస్తుంది. తర్వాత వేరుశనగపప్పులో నానబెట్టుకోవాలి అలాగే గుమ్మడి గింజల పప్పు, పుచ్చ గింజల పప్పు, పొద్దుతిరుగుడు గింజలు కూడా 8 గంటలసేపు నానబెట్టుకోవాలి.
ఈ నాలుగు విత్తనాల్ని విడివిడిగా కప్పులో పోసుకుని నానబెట్టుకోవాలి. సుమారుగా 8 అలా నానితే చాలా మంచిది. ఈ నానబెట్టిన పప్పుల ని నీళ్లను తీసేసి కడిగేసుకుని విడివిడిగా పెట్టుకోవాలి ఎందుకు అంటే ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి. కాబట్టి విడివిడిగా నమ్మిన తింటే దేని టేస్ట్ దానికి సపరేట్గా ఉంటుంది. కలిపి తింటే అంత టేస్ట్ గా అనిపించవు. వీటిని ఖర్జూరం పళ్ళు పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. అందుకని వీటిని తినేసి తర్వాత ఒక జామకాయ గాని రెండు మూడు అరటి పండ్లు తినేస్తే సరిపోతుంది. రోజులు నానబెట్టిన పప్పులు, కొబ్బరి తురుము ఇలా ఒక మీల్ లా చేసుకోవచ్చు.
ఈ మీల్ నీ ఉదయం గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని తినగలిగితే ఎంత బలం వస్తుంది అంటే రెండు పూటలా అన్నం తింటే ఎంత బలం వస్తుందో ఒక్కసారి ఈ ఆహారం ఇలా తింటే అంత బలం వస్తుంది. వీటిని పెద్దవాళ్లకు గాని పిల్లలను గాని ఎవరికైనా బలం రావాలి అంటే ఈ మెయిల్ ని రోజుల్లో ఒకసారి పెడితే వాళ్ళకి చాలా బలం వస్తుంది. వీటిని తినడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మూడు రోజుల్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. నీరసం ఎంత తగ్గుతుందో తెలుస్తుంది. పని సామర్థ్యం ఎంత పెరుగుతుందో తెలుస్తుంది. ఇక మజిల్ పవర్ ఎంత పెరుగుతుందో అర్థమవుతుంది. అంటే ఎన్నో గంటలు పనిచేయడానికి కావలసినంత బలం వస్తుంది.
ఈ విధంగా ఈ పంచరత్నాలు కలుగజేస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఆహారాన్ని ప్రతిరోజు తినగలిగితే ఎంతో బలమనేది వస్తుంది.