ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి కీళ్ల నొప్పులు వస్తున్నాయి. కాలు నొప్పి,చేయి నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నొప్పులను తగ్గించుకోవడం కోసం రకరకాల హాస్పిటల్స్ తిరిగి రకరకాల మందులను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లభించుట లేదు. కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించి కొంతవరకూ నొప్పులు తగ్గించుకోవచ్చు.
ఇప్పుడు మనం మోకాలు నొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటి అన్ని సమస్యలు తగ్గించే చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉల్లిపాయ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఉల్లిపాయ పొట్టు తీసి వేసుకుని అర గ్లాసు నీళ్లు వేసి మూడు నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి నీటిని గ్లాసులో వడకట్టుకోవాలి. దీనిలో అర చెంచా తేనె కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు టీ తాగినట్టుగా వేడివేడిగా తాగి పడుకోవాలి.
వరుసగా ఏడు రోజులపాటు తాగినట్లయితే శరీరంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. ఎటువంటి మందులు అవసరం లేకుండా నొప్పులు అన్నిటిని తగ్గించుకోవచ్చు. తర్వాత రెండవ స్టెప్ పొట్టు తీసుకున్న ఉల్లిపాయను గ్రేటర్ సహాయంతో మెత్తగా తురుముకోవాలి. తరువాత రెండు అంగుళాల అల్లం ముక్క తీసుకుని గ్రేటర్ సహాయంతో మెత్తగా తురుముకోవాలి. మనం తురుముకున్న అల్లం మరియు ఉల్లిపాయలను ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో ఒక చెంచా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
తరువాత ఏ భాగంలో నొప్పి ఉందో ఆ భాగంలో ఈ పేస్ట్ ను అప్లై చేసి సాక్స్ లేదా ప్లాస్టిక్ కవర్ వేసి టైట్ గా కట్టుకోవాలి. ఈ డ్రింక్ తాగిన తర్వాత ఈ చిట్కా కూడా ట్రై చేసినట్లయితే నడవ లేని వారిని సైతం నడిచేలా చేస్తుంది. అల్లం మరియు ఉల్లిపాయ నొప్పులను తగ్గించి ఎన్నో రోజుల నుంచి పడుతున్న బాధ నుండి ఉపశమనం ఇస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నొప్పి విపరీతంగా ఉన్నాయి ఏం ట్రై చేసిన తగ్గట్లేదు అనుకునేవారు ఒక్కసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. హాస్పిటల్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేకుండా కేవలం ఇంటి చిట్కాల ద్వారా ఎంత తీవ్రమైన నొప్పి అయినా సరే ఈజీగా తగ్గించుకోవచ్చు.