knee pain home remedies with tamarind seeds

ఆపరేషన్ చేయాల్సిన నడుం కీళ్ళ నొప్పులు ఈ ఒక్క రెసిపీతో పోతాయి.

ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సమస్య. మోకాళ్ళు, కీళ్ళనొప్పులు ఎక్కువగా దాడి ఛేస్తున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి పురాతన వంటకం ఒకటి తెలుసుకుందాం. దానికోసం మనకు కావలసిన పదార్థాలు రెండు. ఒకటి చింతపిక్కలు. 

 చింతపండు యొక్క చిక్కని-అంటుకునే పండ్ల గుజ్జు లోపల దాచిన ఈ  నల్లని గింజలు ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు మరియు ఖనిజాలతో నిండిన విత్తనాలు అని మీకు తెలుసా?  పోషకాలతో నిండిన ఈ చిన్న విత్తనాలు  ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి!

 ఎందుకు పనికిరావని పడేసే చింతపిక్కలలో అద్బుతమైన ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి. దానికోసం చింతపిక్కలు బాగా వేయించాలి. స్టవ్ ఆన్ చేసి పెనంపై ఒక గ్లాసు చింతపిక్కలు వేయించాలి. ఇవి వేగాయని తెలియడానికి ఇవి కొంచెం పగులుతాయి. అప్పుడు స్టవ్ కట్టేసి పైన తొక్కలు తీసేసి వీటిని రాత్రంతా నానబెట్టాలి.  ఒక గ్లాసు బియ్యాన్ని కూడా రాత్రి నానబెట్టుకోవాలి. 

ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి ఇలా నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ పట్టాలి. తర్వాత కొంచెం నీళ్ళతో చిఔత పిక్కలను కూడా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఈ రెండు మిశ్రమాలని కలిపి దోశెలా పోసుకోవాలి. ఇలమవి రెండు వైపులా కాల్చి తినడం వలన కీళ్ళు నొప్పులు, నడుంనొప్పి వంటివి తగ్గిపోతాయి. 

  సాంప్రదాయ ఆయుర్వేద ఉపయోగాలలో, కాల్చిన చింతపండు పిక్కలు విత్తన పొడిని తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు మరియు ఆర్థరైటిస్‌కు చికిత్సగా ఉపయోగిస్తారు. వీటి వలన మంచి ప్రయోజనం  ఉంటుంది.  చింతపండు విత్తనం కీళ్ళలో కలిగే మంట మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని, నొప్పి తగ్గడానికికి సహాయపడుతుంది.

 మరియు ఎముక ధృడత్వం మరియు లోపలి మృదులాస్థిని కాపాడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. మంచి వ్యాయామం, ఆహారంతో పాటు ఇటువంటి చిట్కాలు నడుం, కీళ్ళనొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చింతపండు విత్తనాలు మీ చర్మాన్ని వైరల్, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది పేగు మరియు మూత్ర మార్గము యొక్క ఇన్ఫెక్షన్ల నుండి కూడా మీకు ఉపశమనం కలిగిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!