knee pain home remedy with guava leaves

రెండు ఆకులు ఒక్క రాత్రిలో మోకాళ్ళ నొప్పులు మాయం చేస్తుంది

జామకాయ మనందరికీ బాగా తెలిసిన పండు. సంవత్సరం అంతా అందుబాటులో ఉండే ఈ పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని మన అందరికి తెలిసిందే. పేదవాడి ఆపిల్ గా పేరొందిన ఈ పండుని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తుంటాయి. అయితే ఈ జామ చెట్టు ఆకులలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు అందించే గుణం ఉందని మనకు తెలియదు.

జామ ఆకులను చిన్న ముక్కలుగా తుంచి ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఆ నీరు సగం అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. తర్వాత నీటిని మరిగించడం ఆపి వడకట్టి ఈ కషాయం ఉదయాన్నే పరగడుపున తాగడం వలన మధుమేహం ఉన్నవారికి శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. భోజనం తర్వాత ఒక కప్ తాగినా కూడా బ్లడ్ షుగర్ను అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా షుగర్ వలన వచ్చే అనేక అనారోగ్యాల నుండి తప్పించుకోవచ్చు.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి. జామాకులలో ఉండే పొటాషియం గుండెకు మేలు చేయడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి జామ ఆకుల కషాయం చాలా బాగా పనిచేస్తుంది. రుతుక్రమంలో కడుపునొప్పితో బాధపడేవారు ఈ జామ ఆకుల రసం లేదా టీ తాగడం వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. మోకాళ్ళ నొప్పులు లేదా జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి ఈ జామ ఆకుల కషాయం ఒక దివ్యౌషధం.

జాయింట్ పెయిన్స్ ఉన్నచోట ఈ జామ ఆకులను వేడి చేసి  నొప్పి ఉన్న చోట కట్టాలి. రాత్రంతా అలాగే ఉంచుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే చాలు మీ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. జామ ఆకులలో ఆక్సిలైట్స్ అనేవి ఉంటాయి. ఇవి నోటి పూత, గొంతునొప్పి ,నోటిలో పుండ్లు , చిగుళ్లవ్యాధి వంటి నోటి సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతాయి.

ఇవేకాకుండా జామ అనేక వ్యాధులకు సాంప్రదాయక ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. రుతు క్రమంలో తిమ్మి, విరేచనాలు, వైరల్ ఫ్లూ, టైప్ 2 డయాబెటిస్ మరియు క్యాన్సర్‌తో సహా అనేక జబ్బులు మరియు లక్షణాలపై జామ ఆకు సారంలోని సమ్మేళనాలు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని జామ ఆకులపై చేసిన ప్రాథమిక పరిశోధన సూచిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!