Knee pain relief products

పరగడుపున వీటిని కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు అస్సలు ఉండవు……. ముఖ్యంగా ఈ సీజన్లో……..

 ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. కొంచెం పని చేసిన నీరసం అలసట వస్తుంది. అంతేకాకుండా కూర్చొని లేగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలోను, శీతాకాలంలోను మరీ ఎక్కువగా ఉంటాయి. ఈ నోప్పులు రాగానే చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన ఆహార పదార్థాల ద్వారా నోప్పులను తగ్గించుకోవచ్చు. వీటి వలన మంచి ఫలితం కూడా లభిస్తుంది.

ఎముకలు బలహీనంగా మారడానికి క్యాల్షియం మరియు విటమిన్ ఇ లోపమని చెప్పవచ్చు. సాధారణంగా 30 సంవత్సరాలు దాటిన స్త్రీలలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం నివారించుకోవాలి అంటే నువ్వులు మరియు బాదంపప్పు తీసుకోవాలి. నువ్వులలో ఎన్నో పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మన పూర్వీకులు నువ్వులు ఆడించి నువ్వుల నూనె ఉపయోగించేవారు. నువ్వుల్లో ఉన్న పోషకాలు వలన నువ్వులను పవర్ హౌస్ అని పిలుస్తారు. నూనెలో జింక్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి.

ఇవన్నీ ఎముకలు దృఢంగా పుష్టిగా ఉండడానికి సహాయపడతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రోగనీరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి. ఈ నువ్వులను నానబెట్టి లేదా వేయించి తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకు తీసుకోవాల్సింది బాదం. బాదంపప్పులో కూడా ఎన్నో పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీటిని తినే వారు కూడా ఎక్కువగా ఉన్నారు. బాదం లో ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది.

మరియు క్యాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకల దృఢంగా ఉండడానికి సహాయ పడతాయి. అంతే కాకుండా  మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడతాయి. రోజుకు ఐదు బాదం పప్పులను తీసుకుంటే చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో ఐదు బాదం పప్పులు వేసుకుని ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు నీటిని పోసి నానబెట్టుకోవాలి.

ఈ విధంగా రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం పూట తీసుకోవాలి. ఇలా రోజు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారి కీళ్లనొప్పి నుంచి విడుదల అందిస్తుంది

Leave a Comment

error: Content is protected !!