knee pain remedy with jilledu flowers and leaves

కేవలం పదినిమిషాల్లో కీళ్ళు,కాళ్ళు,పాదాల నొప్పులు నుండి ఉపశమనం

కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు అధికమైపోతున్న ఈ సమయంలో అందరికీ అందుబాటులో ఉండే ఇంటి చిట్కాలతో వీటిని తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకుందాం. కాళ్లు, పాదాలు, కీళ్లనొప్పులతో పాటు ఆర్థరైటిస్ నొప్పులను కూడా తగ్గించుకోవచ్చు. 

దానికోసం కావలసినవి జిల్లేడు ఆకులు. వీటిని వినాయకుని పూజలో ముఖ్యంగా  ఉపయోగించే ఉంటారు. జిల్లేడు చెట్టుకి  ఆయుర్వేద వైద్యంలో ప్రముఖమైన స్థానం ఉంది. 

జిల్లెడు చెట్టు ఆకులు లేదా పువ్వులు సేకరించేటప్పుడు వచ్చే పాలను కళ్ళు లేదా ముఖానికి తగలకుండా జాగ్రత్త పడాలి. లేదంటే కంటి చూపు పోవడం లేదా ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జిల్లేడులో రెండు రకాల జాతులు ఉంటాయి.  

అందులో ఒకటి తెల్ల జిల్లేడు. అదే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది. దీని పువ్వులు తెల్లగా ఉంటాయి. వీటిని వినాయకుడుకి ప్రతిరూపంగా పూజిస్తారు. ఈ తెల్ల జిల్లేడు పువ్వులను 10 తీసుకోవాలి. వీటిని ఒక గ్లాసు నీటిలో వేసి రంగు మారేంతవరకు మరిగించాలి.

 ఇప్పుడు ఈ నీటిని కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నచోట నెమ్మదిగా వేస్తూ కడగాలి. తర్వాత ఉడకబెట్టిన జిల్లెడు పువ్వులను ఒక పొడి గుడ్డలో వేసి నొప్పులు ఉన్న చోట దారంతో కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల కాళ్లు, కీళ్లనొప్పులను నుండి ఉపశమనం లభిస్తుంది. 

పాదాల నొప్పులుగా ఉన్నప్పుడు ఆకులకు ఆవనూనె లేదా నువ్వుల నూనె రాసి పొయ్యి పై వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట కట్టు కట్టాలి. ఇలా చేయడం వలన ఆకులోని గుణాలు నూనె యొక్క నొప్పి నివారణ గుణాలు కలిసి నొప్పిని తగ్గిస్తాయి. 

జిల్లేడు పువ్వులు  ఉడికించిన నీటిలో పాదాలను పెట్టి పది నిమిషాలు ఉంచిన నొప్పులు తగ్గుతాయి. నడుము నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆకుల నుంచి సేకరించిన పాలను నొప్పి ఉన్న చోట మసాజ్ చేసి పాలు శరీరంలోకి ఇంకేలా చేయాలి. 

తర్వాత నువ్వులనూనెతో గోరువెచ్చగా ఉన్నప్పుడు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చు. ఇలా సేకరించిన పాలను కీళ్ళనొప్పులకు కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ పాలను ముందుగా చెప్పినట్టు కళ్ళు లేదా ముఖానికి తగలకుండా జాగ్రత్త పడాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ చిట్కా పాటించండి పోవడం మంచిది.

1 thought on “కేవలం పదినిమిషాల్లో కీళ్ళు,కాళ్ళు,పాదాల నొప్పులు నుండి ఉపశమనం”

Leave a Comment

error: Content is protected !!