మనం తరచుగా వాడే కూరగాయల్లో గోరుచిక్కుడు ఒకటి. ఆరోగ్యం నుండి పారిశ్రామిక అవసేయాల దాకా అన్నిరకాలుగా ఉపయోగపడుతుందిది. గోరుచిక్కుడు ఫ్రై, వెల్లుల్లి కారం ఇలా బోలెడు వంటకాలు మనం నిత్యం చేసుకుంటూ తింటుంటాం. అయితీ ఈ గోరుచిక్కుడు వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్ అవేంటో చూద్దాం.
మధుమేహ సమస్య ఉన్నవారికి గొప్ప వరం
గోరుచిక్కుడులో గ్లైకోన్యూట్రియెంట్స్ ఉంటాయి, ఇవి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గోరుచిక్కుడు లో గ్లైసెమిక్ శాతం తక్కువగా ఉందనే విషయం చాలా మందికి తెలియదు. గోరుచిక్కుడును మనం ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలలో వేగంగా హెచ్చుతగ్గులు ఉండవు. డయాబెటిస్‌తో బాధపడుతుంటే తప్పకుండా గోరుచిక్కుడును ఆహారంలో భాగంగా చేర్చవలసిన అవసరం ఎంతో ఉంది.
ఎముక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది
వీటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది మరియు ఎముకల బలహీనతను, ఎముకకు సంబందించిన సమస్యలను అరికట్టడంలో సహాయపడుతుంది. ఇందులో భాస్వరం ఉండటం వల్ల ఎముకలను బలపరచడంలో మరింత ప్రభావవవంతంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి గొప్పది
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) తో కలుషితమైన రక్త స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాడటంలో సమర్థవంతమైన పాత్రను పోషిస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్, పొటాషియం మరియు ఫోలేట్ ఉండటం వల్ల గుండెకు సంభవించే వివిధ రకాల సమస్యలను నిరోధిస్తుంది.
రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది.
గోరుచిక్కుడులో ఉండే హైపోగ్లైసీమిక్ మరియు హైపోలిపిడెమిక్ లక్షణాలు రక్తపోటుతో బాధపడుతున్న వారికి సహాయపడతాయి. డయాబెటిస్ మరియు గుండె జబ్బుల సమస్యను పెంచే రక్తపోటు ప్రమాదాన్ని గోరుచిక్కుడు సమర్థవంతగా ఎదుర్కొంటుంది. ,
గర్భవతుల ఆరోగ్యానికి మంచిది
ఇందులో ఉండే ఐరన్ మరియు కాల్షియం గర్భిణీ స్త్రీలకు కావాల్సిన పోషకాలను భర్తీ చేస్తాయి. అలాగే ఇందులో ఫోలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది, ఇది పిండం అనేక జనన లోపాల నుండి మరియు గర్భధారణ సంబంధిత ఆరోగ్య సమస్యల నుండి నిరోధిస్తుంది. గోరుచిక్కుడు లో ఉండే విటమిన్ కె ఎముకలకు మంచిది మరియు పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. కాబట్టి గర్భవతులు గోరుచిక్కుడును నిరభ్యరంతంగా తీసుకోవచ్చు.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
గోరుచిక్కుడులో ఐరన్ అధికశాతం ఉండటం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది శరీరంలో సరైన రక్త సరఫరాకు సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులో ఫైటోకెమికల్స్ ఉన్నాయి, ఇవి రక్తం యొక్క ఆక్సిజన్ మోసే సామర్థ్యాన్ని ఉత్తేజపరుస్తాయి, ఫలితంగా మంచి రక్త ప్రసరణ జరుగుతుంది.
జీర్ణశక్తి ని పెంపొందిస్తాయి
గోరుచిక్కుడులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్దకాన్ని సులువుగా అధిగమిస్తుంది. , ప్రేగు కదలికను ప్రేరేపిస్తుంది మరియు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపు లో దాగున్న టాక్సిన్స్ లను బయటకు పంపడానికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.
మెదడును పనితీరు మెరుగుపరుస్తుంది మరియు ఆందోళనలు తగ్గిస్తుంది
ఇందులో ఉన్న హైపోగ్లైసీమిక్ లక్షణాలు నరాల పనితీరును సమర్థవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. నరాల తిమ్మిర్లు, వాపు, నొప్పులు వంటి వాటిని గోరుచిక్కుడు అద్భుతంగా తగ్గిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత చేకూర్చడంలో దోహదపడుతుంది.
చివరగా….
గోరుచిక్కుడు మన ప్రాంతాల్లో విరివిగా దొరుకుతూనే ఉంటుంది కాబట్టి ఎలాంటి సంకొంచం లేకుండా వాడి బోలెడు ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.