Konda Palleru Pedda Palleru ayurvedic medicinal plant benefits

కొండపల్లేరు మొక్క రహస్యం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే

పల్లేరు కాయలు పల్లెల్లో పుట్టిన వారికి పరిచయం ఉండే ఉంటాయి. ముళ్ళతో ఉండే ఈచిన్న కాయలు పల్లెలు సముద్రతీర ప్రాంతాల్లో, ఇసుక నేలల్లో అధికంగా ఉండి కాళ్ళకు గుచ్చుకుని విపరీతమైన నొప్పితో ఇబ్బందిపెడుతుంటాయి. ఈ పల్లేరుకాయలు ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోతారు. ఈ పల్లేరుకాయలను దంచి అశ్వగంధ పాలలో మరిగించి తాగడంవలన అలసట, ఒత్తిడి, డయాబెటిస్, అధికబరువు వంటి సమస్యలు తగ్గిస్తుంది. ఈ కాయలను దంచి పొడి చేసి అందులో వావిలాకు పొడి కలిపి తాగడం వలన పురషులలో లైంగిక శక్తి పెరుగుతుంది. స్త్రీలలో బహిష్టు, గర్బాశయ దోషాలు తొలగిపోతాయి. 

పల్లేరు కాయల్లో రెండు రకాలు ఉంటాయి.అవి ఒకటి చిన్న పల్లేరు కాయలు,కొండ పల్లేరు లేదా ఏనుగు పల్లేరుకాయలు అంటారు. పల్లేరుకాయలు పొడి తింటే ఆరోగ్యకరమైన సంతానం పుడుతుంది. ఈ పల్లేరుకాయలు నీటిలో మరిగించిన కషాయం రోజూ తాగితే పైత్యంవలన వచ్చే తలనొప్పి తగ్గుతుంది. పల్లేరుపువ్వులు మెత్తగా పేస్ట్ చేసుకుని కషాయంలా చేసుకుని తాగితే  దగ్గు‌,క్షయ వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. పల్లేరుకాయలు పొడి పాలలో కలిపి తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. మొక్క వేళ్ళతో సహ దంచి పాలలో నానబెట్టి తర్వాత పాలు కలిపి వడకట్టి చూర్ణంలో తేనె కలిపి తాగితే ఆయాసం, ఉబ్బసం తగ్గడంలో సహాయపడతాయి. 

కొండ పల్లేరు కాయలు పొడిచేసి అందులో వావిలాకు పొడి కలిపి రోజుకు రెండు చెంచాలు తీసుకుంటే కాలేయం శుభ్రపడి శరీరంలో  అనేక రకాల వ్యాధులను తగ్గిస్తుంది. ఈ పొడి శరీరంలో వేడిని తగ్గించి చలవచేస్తుంది. డయేరియా వలన విరోచనాలు ఉన్నవారికి పెద్దపల్లేరు కాయలు కషాయం చేసి తాగితే విరోచనాలు తగ్గుతాయి.

ఈ పొడిని క్రమంతప్పకుండా తీసుకుంటుంటే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. మూత్రంలో నొప్పి, మంట వంటి మూత్ర సంబంధవ్యాధులను తగ్గిస్తుంది.

 కొండపల్లేరు పొడి గుండెసంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. కళ్ళకు చలవచేసి కంటివ్యాధుల బారినపడకుండా కాపాడుతుంది. స్ర్తీల గర్బాశయ రోగాలు తగ్గాలంటే ముఫ్ఫై గ్రాముల పల్లేరు ఆకులు, పదిమిరియాలు మెత్తగా దంచి రెండు భాగాలు చేసి రోజులో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేసుకుంటూ తెల్లవెల్లుల్లి రెబ్బలు రెండు సేవిస్తే కుసుమ రోగాలు తగ్గిపోతాయి. యాంటీ బాక్టీరియల్,  యాంటి ఇన్ప్లమేటరీ గుణాల వలన నొప్పులు, వాపులు తగ్గుతాయి. 

ఒళ్ళు మంటలు తగ్గించి వేడివలన వచ్చే వ్యాధులు రాకుండా చేస్తుంది. రక్తంలో చెడుకొలెస్ర్టాల్ కరిగించి అధికబరువు సమస్య లేకుండా చేస్తుంది. చిగుళ్ల సమస్యలు, పళ్ళనరాల సున్నితత్వాన్ని  తగ్గించి పంటి సమస్యలు రాకుండా చేస్తుంది. శ్వాస సంబంధ వ్యాధులైన జలుబు, దగ్గు రాకుండా చేస్తుంది. శరీరంలో వాత,పిత్త, కఫ దోషాలను తొలగించి అనేక రోగాలనుండి రక్షించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తంనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ కరిగించి అధికబరువు సమస్య తగ్గిస్తుంది. 

2 thoughts on “కొండపల్లేరు మొక్క రహస్యం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే”

  1. పల్లేరు కాయలు, మొక్కలు కావలసివారు సంప్రదించండి.

    Reply

Leave a Comment

error: Content is protected !!