హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య కిడ్నీలో రాళ్లు. మన శరీరంలో క్యాల్షియం ఫాస్పేట్ ఆక్సలేట్ రసాయనాలు పేరుకొనిపోయి మూత్రపిండాల్లో రాళ్లుగా మారుతాయి. క్యాల్షియం టాబ్లెట్ లను ఎక్కువగా వాడడం వలన అది క్యాల్షియం ఆక్సలేట్ గా మారి రాళ్ళు ఏర్పడతాయి. దీనిని మన ఆయుర్వేదంలో మూత్రాస్మరి అని అంటారు. ఈ రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి, జ్వరం, వాంతి, ఆకలి లేకపోవడం, నిద్ర లేకపోవడం, మూత్రం పోసేటప్పుడు మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. ఆసుపత్రికి వెళ్లి సర్జరీతో వీటిని తొలగించుకున్న కొన్నిసార్లు మళ్లీ ఏర్పడుతూ ఉంటాయి.
ఈ సమస్యకు మన పెరట్లో దొరికే కొండపిండాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిని కొన్ని చోట్ల తెలగపిండి ఆకు అని కూడా అంటారు. సంస్కృతం లో దీనిని పాషాణభేది అని పిలుస్తారు. ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిన ఈ మొక్క యొక్క ఆకులను చాలా చోట్ల పప్పు తో కలిపి తింటారు.
వీటి ఆకులను ఎండబెట్టి దంచి దాన్ని చూర్ణంగా చేసుకొని రెండు చెంచాల చూర్ణము అరగ్లాసు నీళ్లలో కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్లు చాలావరకు కరిగిపోతాయి. దీని యొక్క ఆకులు శుభ్రంగా కడిగి వీటిని నీటిలో మరిగించి వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపున 20 రోజులపాటు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
వీటి ఆకులను ఉదయాన్ని డైరెక్ట్ గా కూడా తినవచ్చు ఈ ఆకు వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటిని కిడ్నీలో రాళ్లు లేని వారైనా నిరభ్యంతరంగా తినవచ్చు. అలాగే ఈ ఆకు తీసుకోవడంతోపాటు ప్రతిరోజు నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలి. పాలకూర సోయాబీన్స్ టమోటా కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. ఉప్పు మితంగా తీసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు.