kovvu gaddalu treatment telugu

శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నాసరే ఇది రాయండి. వెంటనే కొవ్వు గడ్డలు మంచులా కరిగిపోతాయి

మన శరీరంలో అధికంగా చేరిన కొవ్వు తిత్తిలా ఏర్పడి కొవ్వు గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కొందరికి ఒకే చోట  పెద్దగా ఒకటి, రెండు ఉంటే కొందరికి చిన్న చిన్న గడ్డలు శరీరమంతా వ్యాపించి ఉంటాయి. వీటిని ఎడిమా అని అంటారు. ఇవి శరీరంలో నరాలపై ఏర్పడితే అక్కడ ఒత్తిడి కలిగించే నొప్పికి కారణమవుతాయి. ఈ గడ్డలు శరీరంలో ఉండటం వలన ఎటువంటి నష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో క్యాన్సర్ గడ్డలుగా మారే అవకాశం ఉంది. వీటిని తగ్గించుకోవడానికి వైద్యంలో ఆపరేషన్ ఒక్కటే మార్గం. అయితే ఆయుర్వేద వైద్యంలో వీటిని కొన్ని రకాల చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.

ఈ చిట్కా కోసం పచ్చి పసుపు తీసుకోవాలి. మార్కెట్ లో పచ్చి పసుపు అమ్ముతుంటారు. వీటిని తెచ్చి ఎండబెట్టి పొడి పట్టించుకోవడం వలన స్వచ్ఛమైన పసుపును ఇంటి అవసరాలకు వాడుకోవడానికి ఉపయోగించవచ్చు. పచ్చి పసుపు అందుబాటులో లేనివారు ఆయుర్వేద షాపుల్లో పచ్చి పసుపు పొడి అంటే ఇస్తారు. దీనిని ఒక స్పూన్ ఒక గిన్నెలో వేసుకొని, దీనిలో నాలుగు లవంగాలను మెత్తగా పొడిలా చేసి వేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ ఆవ నూనె వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి ఎక్కడైతే కొవ్వు గడ్డలు ఉన్నాయో అక్కడ ఈ మిశ్రమాన్ని పెట్టి బ్యాండేజ్ క్లాత్ లేదా కాటన్ క్లాత్ తో కట్టులా కట్టాలి. ఇలా రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం శుభ్రపరచుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేయడం వలన కొవ్వు కరిగిపోయి కొవ్వు గడ్డలు నివారించుకోవచ్చు.

పసుపులోని కర్కుమిన్ మరియు ఇతర రసాయనాలు వాపును తగ్గిస్తాయి (మంట).  దీని కారణంగా, మంటతో కూడిన పరిస్థితుల చికిత్సకు పసుపు ప్రయోజనకరంగా ఉంటుంది. లవంగం నూనెలో క్రియాశీల పదార్ధం యుజినాల్ ఉంటుంది, ఇది సహజమైన మత్తుమందు.  కండరాల నొప్పులకు మస్టర్డ్ ఆయిల్ గొప్పగా సహాయపడుతుంది.  నొప్పి ఉన్న ప్రదేశంలో కొద్దిగా గోరువెచ్చని ఆవాల నూనె వేసి పదిహేను నిమిషాల పాటు సరిగ్గా మసాజ్ చేయండి.  నూనె నొప్పి మరియు వాపును తగ్గిస్తుంది. ఇది వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. కొవ్వు గడ్డలు పై రాసినప్పుడు ఇది కొవ్వును కరిగించి గడ్డలు లేకుండా చేస్తుంది.

1 thought on “శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నాసరే ఇది రాయండి. వెంటనే కొవ్వు గడ్డలు మంచులా కరిగిపోతాయి”

  1. కచ్చితంగా తాగుతాయా
    తగిన వారితో ఒకసారి
    ఎవరు అయిన 9494046423
    చేయించగలరా

    Reply

Leave a Comment

error: Content is protected !!