రోడ్డు పక్కన కలుపుమొక్కలుగా కనిపించే చాలా మొక్కలు ఔషధగుణాలు కలిగి ఉండేవిగా ఉంటాయి. అలాంటిదే మనం ఎక్కువగా చూసేదే ఈ మొక్క. ఊర్లలో బుడిమకాయ, బుడ్డికాయ, కుప్పంటి అనే పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క శాస్ర్తియ నామం పైసాలిస్ పెరువినియా అంటారు. అలాగే ఇంగ్లీష్ లో వైల్డ్ రాస్బెర్రీస్ అంటారు. వీటిలో చాలా రకాల మొక్కలు ఉంటాయి. ఈ మొక్క మృదువైన ఆకులతో, చిన్న చిన్న కాయలతో పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తాయి.ఈ మొక్క రెండున్నర అడుగులు పెరిగి ఉంటుంది. సంక్రాంతి సమయంలో ఈ మొక్క పండ్లను తింటుంటారు. ఈ పండ్లను తినడంవలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి
ఈ పండ్లుపైన రక్షణ కవచంలా మృదువైన ఆకులాంటి రేకులతో కప్పపడి, తింటుంటే టమాటా రుచిలో ఉంటాయి. ఈ పండ్లను ఆయుర్వేదంలో అనేక ఔషధాలలో వాడతారు. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, డైటరీ ఫైబర్, పొటాషియం, మేంగనీస్ లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. అలాగే కెరొటనాయిడ్స్, పాలిఫినాల్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్‌కి కూడా మంచి మందు.
ఈ పండ్లలో ఎంతో విలువైన ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి.
కాలరీస్ తక్కువ ఉంటాయి కనుక బరువు తగ్గాలనుకునేవారికి మంచిది. ఈ పండ్లను తింటూ ఉంటే ఊబకాయం సమస్య తగ్గి గుండె, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు రాకుండా చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అనేక వైరస్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా రోగనిరోధక శక్తి కాపాడుతుంది. కాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఈ పండ్లకి ఉంది. డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఈ పండ్లు తింటూ ఉంటే చక్కెర లెవల్స్ తగ్గుతాయి. కంటి చూపు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ కళ్ళకూ, శరీరానికి మంచిది. హైబిపీని కూడా ఈ పండ్లు తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ పండ్లు తినేటప్పుడు ఈ విషయాలు కూడా గుర్తు పెట్టుకోండి. ఈ కాయలు బాగా పండినపుడు మాత్రమే తినాలి. అలాగే కొంతమందికి బెర్రీస్ తింటే ఎలర్జీలు వస్తుంటాయి. వారు డాక్టర్ల సలహాతో తినడం మంచిది. అలాగే గర్భవతులు, పాలిచ్చే తల్లులు తినకపోవడం మంచిది. ఇంతమంచి ఔషధ లక్షణాలు ఉన్న ఈ పండ్లు దొరికితే మర్చిపోకుండా తినండి.
Hii sir