kuppintaku Acalypha indica health benefits

పైసా ఖర్చు లేకుండా మోకాళ్ళనొప్పిని నిమిషాల్లో తగ్గించుకోండి

హలో ఫ్రెండ్స్… ఈ మధ్యకాలంలో వయసుతో పనిలేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఈ నొప్పులు వచ్చాయంటే చాలా  కష్టం గాను మరియు బాధగాను  ఉంటుంది. ఈ నొప్పులు అంత తొందరగా కూడా తగ్గవు. ఈ కీళ్ల నొప్పులు ఒకప్పుడు పెద్దవాళ్లలో మాత్రమే కనబడేవి. కానీ మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఈ మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నాయి.

ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు అనేవి మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ నొప్పులు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు మరియు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వస్తే ఈ రోజుల్లో మనం ఏమి ఆలోచించకుండా ఆస్పత్రులకు వెళ్తున్నాం. కానీ మన పూర్వీకులు మాత్రం నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఈ కుప్పింట మొక్కను వాడేవారు. కుప్పింటి మొక్క గురించి గ్రామాల్లో ఉండే వారికి చాలా బాగా తెలుసు. ఈ కుప్పింటి మొక్క రోడ్లకు ఇరువైపులా లేదా పంట పొలాల గట్ల పైన మరియు బంజరు భూముల్లో చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఇంటి దగ్గర కూడా ఈ మొక్కలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అయితే చాలామందికి ఈ మొక్క గురించి తెలియక పిచ్చి మొక్క అని అనుకుంటారు. ఈ మొక్క పేరు కొంతమందికి తెలిసినప్పటికీ దాని యొక్క ఉపయోగాలు తెలియదు.

కుప్పింటి ఆకుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

లిఫోర్బియస్సీ అనే  కుటుంబానికి చెందిన ఈ మొక్కను మురుపిండి  లేదా హరిత మంజరి అనికూడా అంటారు. ఈ మొక్క  ఆకులు అండాకారంలో ఉంటాయి. దీని శాస్త్రీయ నామం Acalypha indica. ఈ కుప్పింటి మొక్క ఆకులు తెచ్చుకొని బాగా ఎండబెట్టాలి. తర్వాత దానిని పొడి లాగా తయారు చేసుకోవాలి. ఆ పొడిని ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని ఆరో క్లాసు అయ్యేవరకు బాగా మరిగించాలి. తరువాత ఆ నీటిని వడగట్టి అందులో నాలుగు స్పూన్ల అల్లం రసం కలుపుకొని దానిని రోజూ సేవిస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా తాగుతూ ఉంటే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గుముఖం పడతాయి.

అలాగే ఒక స్పూన్ కుప్పింటి ఆకు రసం లో ఒక స్పూన్ నిమ్మ రసం వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని కీళ్ళనొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి ఇలా చేయడం వల్ల మీ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా పేజీని లైక్ చేసి ఇ మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మర్చిపోకండి 

2 thoughts on “పైసా ఖర్చు లేకుండా మోకాళ్ళనొప్పిని నిమిషాల్లో తగ్గించుకోండి”

Leave a Comment

error: Content is protected !!