మనం మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు చేసేస్తుంటాం. అవి మనల్ని తీరని కష్టాల్లో తోసేస్తూ ఉంటాయి. అలాంటి ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం మన ఇంటికి ఎవరైనా వస్తే వారికి అతిధి మర్యాదలు చేస్తాం. వారికి నచ్చింది వండి పెడుతూ ఉంటాం. అలాగే మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నా, పట్టు చీరలు, బంగారం కొనుకున్నా వారికి చూపించాలని వారి మెప్పు పొందాలని అనుకుంటాం అందుకే చాలామంది ఇంటికి వచ్చిన బంధువులను ఇల్లు చూపించి అలాగే కొత్తగా తీసుకున్న చీరలు, నగలు చూపించడానికి బీరువా మొత్తం తెరిచి ఇవి నేను తీసుకున్న నగలు, చీరలు అంటూ అన్నింటినీ వారికి చూపిస్తాం.
అలా చూపించినప్పుడు చాలామంది బయటకి మీ చీరలు బాగున్నాయి, నగలు బాగున్నాయి మీ సెలక్షన్ సూపర్ అంటూ బయటకి నవ్వుతూనే మాట్లాడుతారు. కానీ మనసులో మాత్రం మనపై ఈర్ష, అసూయ పెంచుకుంటారు. ఇవి అనేక రకాల సమస్యలకు కారణమవుతాయి. అంతేకాకుండా మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఇలా బీరువా ఓపెన్ చేసి చూపించడం వలన లక్ష్మీదేవి వారి వెనకే వెళ్ళిపోతుందని తరువాత మనం తీరని కష్టాలు పడవలసి వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా నేటి కాలంలో ఎవరి మనసు ఎలా ఉంటుందో చెప్పలేం. మనకు చాలా సన్నిహితులు, బంధువులే నేటి రోజుల్లో ఆస్తి కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు.
అలాంటిది ఇలా పరిచయస్తులు అందరికీ మన ఇంట్లో ఉన్న నగలు, విలువైన వస్తువులను చూపించడం వలన అది మన ఆస్తికి ప్రాణాలకు ప్రమాదంగా పరిగణించవచ్చు. దీనిని మూఢ నమ్మకంగా కాకుండా మన మంచి కోసం ఇలా చెప్పి ఉండవచ్చని ఆలోచిస్తే ఇకపై ఇతరత్రా ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మనకున్న వస్తువులు ఎదుటివారికి చూపించడం వలన వారికి లేవని కలిగే ఈర్ష్య కూడా నెగిటివ్ ఎనర్జీలా మనపై పడుతుంది. ఇది మనకు అంత మంచిది కాదు. ఎవరు ఎంత దగ్గరి వారైనా సరే అలా బీరువా తెరిచి ఉన్న వాటిని చూపించడం మంచి పద్ధతి కాదు.