latest viral telugu videos to watch

పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన వీడియో తల్లి చేసిన చిన్న నిర్లక్ష్యం బిడ్డ ప్రాణాలు తీసింది

మన జీవితాల్లో కొన్ని సంఘటనలు మనసును ద్రవించేలా చస్తాయి. ఒకరి కష్టం మరొకరికి జీవితం కావచ్చు లేదా ఒకరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణం పోవడానికి కారణం కూడా కావచ్చు. అలాంటి రెండు సంఘటనల గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని థానే జిల్లాకు చెందిన ఒకామెకి ఆరవ నెలలో నొప్పులు రావడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెకి నొప్పులు ఎక్కువ అవడంతో  ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన తర్వాత ఆ బిడ్డలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో బిడ్డ మరణించిందని తల్లిదండ్రులకు అప్పగించారు డాక్టర్లు. ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ చనిపోయిన బిడ్డను స్మశానానికి తీసుకుని వెళ్లారు. 

అయితే ఖననం చేసే సమయంలో ఆ బిడ్డ కదలడంతో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు సరిగ్గా పరిశీలించకుండానే పాప చనిపోయిందని చెప్పడం వలన ఆ బిడ్డ తన ప్రాణాలను కోల్పోయేది.  ఆ విషయం తెలుసుకున్న హాస్పిటల్ అధికారులు మొదట ఆ బిడ్డను పరీక్షించిన డాక్టర్లు, నర్సులను విచారించేందుకు ఆదేశించారు. ఒక్కోసారి మనం దేవుడిగా భావించే డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా తమ పని చేసేవారు ఉన్నారు. అలాగే కష్ట సమయాల్లో రోగుల కోసం తమ కష్టం చూడకుండా నిద్ర కూడా త్యాగం చేసి తమ సేవలను అందించేవారు ఉన్నారు.

 అలాగే మరొక బిడ్డ విషయంలో జరిగిన సంఘటన అందరినీ కదిలించింది. 20 నెలల కనిష్ట అనే పాప ఆ ఇంట్లో అందరికీ ప్రాణప్రదం. అందరూ ఆ చిన్ని పాపని చూసి మురిసిపోయేవారు. అయితే అనుకోకుండా ఆ పాప బాల్కనీ నుండి కింద పడటంతో తలకి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ కి తరలించినా కూడా ఆ పాప వారికి దక్కలేదు. బ్రెయిన్డెడ్ అవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే వారు హాస్పటల్లో ఉన్న సమయంలో చాలామంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నట్టు గమనించి పాప తండ్రి తన బిడ్డ అవయవాలను వారికి దానం చేశారు.

 పాప రెండు కార్యాలను కిడ్నీలను, లివర్ను ఐదుగురికి దానం చేసి వారి ప్రాణాలను కాపాడారు. సమయానికి ఆ పాప అవయవాలు ఆమె తల్లిదండ్రులు అవయవ దానం చేయడం వలన ఐదుగురి ప్రాణాలు కాపాడినట్టు డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇప్పటికీ చాలామంది అనేక అపోహలతో అవయవ దానం చేయడానికి ముందుకు రారు. కానీ మనం శరీరంగా లోకంలో లేకపోయినా తన అవయవాలను దానం చేయడం వలన మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని నిరూపించారు. 

అలాగే సిద్దిపేట దౌలతాబాదుకు చెందిన నిహాన్ అనే రెండేళ్ల బాబు సంఘటన కూడా. అంగన్వాడి సెంటర్లో ఇచ్చిన గుడ్లను ఉడికించి తల్లి ఒకటి బాబు చేతికి ఇచ్చింది. తర్వాత ఆమె తన పని చేసుకుంటూ ఉండగా బాబు గుడ్డును విడదీసి తినాలని తెలియక మొత్తం గుడ్డు ఒకేసారి మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుని తల్లిని పిలిచేందుకు కూడా తెలియక నెమ్మదిగా శ్వాస ఆడక బాబు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తల్లి కొంతసేపటి తర్వాత బాబును చూసి హాస్పిటల్కి తరలించినా అప్పటికే బాబు చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. తన నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడని తల్లి కన్నీరు మున్నీరవడం చూసి సంఘటన అక్కడున్న వారందరినీ కలిచివేసింది.

Leave a Comment

error: Content is protected !!