91 ఏళ్ల వృద్ధురాలు ఎస్టెలా అనే మహిళ 60 ఏళ్లకు పైగా తన కడుపులో పిండాన్ని మోస్తున్నట్లు ఈ మధ్య ఒక అనుకోని సంఘటన వలన డాక్టర్లు కనుగొన్నారు. ఎస్టెలా, ఆమె భర్త మాన్యుయేల్ చిలీలోని లా బోకా అనే చిన్న పట్టణానికి చెందినవారు. అయితే ఒక సంవత్సరం క్రితం 70 ఏళ్ళ పాటు ఆమెతో కలిసి జీవించిన ఆమె భర్త చనిపోయాడు, ఆ తర్వాత ఎస్టేల్లా అనారోగ్యం బారిన పడింది. దానికి కారణం ఆమె కడుపులో కణితి ఒకటి ఉందని డాక్టర్లు చెప్పారు. దాని వలన ఆమెకు వినికిడి శక్తి తగ్గడం తో పాటు, నీరసంగా ఉండేది. వీటితో బాధపడుతున్న ఆమె అనుకోకుండా ఒక రోజు కాలు జారి పడిపోయింది, పడిపోయిన తర్వాత ఆమె బంధువులు ఆమెను ఆ ఊరి పక్కనే ఉండే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
అక్కడ ఎక్స్-రే చేసిన తర్వాత వైద్యులు ఆమె శరీరంలో ఒక ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే అది గర్భాశయంలో ఉందని, అది తిరుగుతున్నట్లు గమనించి వైద్య నిపుణులు దానిని మళ్లీ పరీక్షించారు. అయితే ఎస్టిలా కడుపులో పెరుగుదల కణితి అని మొదట భావించినా తరువాత, రెండవ ఎక్స్-రే తీసారు. అది “కాల్సిఫైడ్ పిండం” అని చూపించింది. అంటే స్త్రీ గర్భాశయంలో పెరగవలసిన పిండం వేరేచోట పెరిగినప్పుడు శరీరం దానిని అబార్ట్ చేస్తుంది. అలా చేయలేనప్పుడు తల్లి టిష్యూలు దానిచుట్టూ పేరుకొని అది లిథోపెడియన్ లేదా “స్టోన్ బేబీ” అని పిలువబడే సిండ్రోమ్గా మారుతుంది, అయితే ఎస్టీలా విషయంలో అది గర్భాశయంలోని పెరిగి అక్కడే స్థిరపడి పోయింది.
మెలెండెజ్‌కి ఆరోగ్య ప్రమాదాన్ని కలిగించిన ఈ పిండం, ఆమె గర్భాశయంలో ఉండడం వలన ఆమెకు పిల్లలు పుట్టకుండా నిరోధించింది. 60 ఏళ్ల పాటు ఆ స్టోన్ బేబీ గర్భాశయంలో ఉండడం వలన తన భర్త, తాను ఎంతగానో ఎదురు చూసిన పిల్లలు పుట్టకపోవడానికి కారణం అయిందని చాలా బాధపడింది. తాను గర్భవతి అని తాను ఎన్నడూ గ్రహించలేదని మరియు జనవరిలో మరణించిన 74 సంవత్సరాల తన దివంగత భర్త మాన్యుయెల్ గొంజాలెజ్, అన్ని సంవత్సరాల పాటు వారి కలను ఎప్పటికీ నెరవేర్చుకోలేకపోయారని చెప్పింది. ఆమె గర్భవతి అయ్యే సమయంలో ఇంత ఆధునిక టెక్నాలజీ లేకపోవడం వలన సమస్య ఎవరికీ తెలియలేదని పత్రిక వారితో మాట్లాడుతూ ఎస్టీలా బాధపడింది. గర్బంలోని పిండాన్ని తొలగించడానికి వైద్యులు ఆపరేషన్ చేయాలని భావించారని, అయితే ఎస్టిలా మెలెండెజ్ వయస్సు , మరియు ఆమె ఆ పిండాన్ని తన భర్త గుర్తుగా ఉంచమని ఆపరేషన్ వద్దని చెప్పడం కారణంగా ఆపరేషన్ చేయటంలేదని డాక్టర్లు చెప్పారు.