సృష్టి లాగే శరీరం కూడా అద్బుతమైనది. కానీ మనిషి చేస్తున్న తప్పులు అన్ని కలిసి అద్భుతమైన శరీరాన్ని అనారోగ్యం బారిన పడేలా చేస్తున్నాయి. ఈ సృష్టి ప్రకృతితో ఎలా అనుసంధానమై ఉంటుందో మనిషి శరీరం కూడా పంచభూతాలతో అనుసంధానమై శరీరంలో ఇమిడి ఉంటుంది. అనారోగ్యం పాలైన శరీరాన్ని తిరిగి స్వస్థత చేకూర్చేందుకు ప్రాచీన ఆయుర్వేదంలో పేర్కొన్న పంచకర్మ గొప్ప వైద్యం. ఎంతో అనుభవం పొందిన వైద్యులు మాత్రమే చేసే ఈ పంచకర్మ శరీరంలో ఉన్న రోగలన్నింటిని మూలాలతో సహా నయం చేస్తుంది. అలాంటి పంచకర్మలో అయిదు రకాల వైద్యాలు ఉన్నాయి. మనిషి శరీర తత్వాన్ని బట్టి వైద్యులు ఎదో ఒక విధానాన్ని ఎంచుకుంటారు.
పంచకర్మలోని అయిదు విధానాలు:
వామన
విరేచన
నస్య
బస్తీ (వస్తి)
స్వేదనం
ఈ పంచకర్మ విధానంలో వైద్యం చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం.
శరీరాన్ని శుద్ధి చేస్తుంది
పంచకర్మ చికిత్స యొక్క మొదటి దశను పూర్వకర్మ అంటారు. ఈ ప్రక్రియలో, శరీరమంతా నూనెతో మసాజ్ చేస్తారు. ఇది శరీరంలో దాగున్న మలినాలను బయటకు వచ్చేలా ప్రేరేపిస్తుంది మరియు ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ మరియు జీర్ణవ్యవస్థ నుండి హానికరమైన విషాన్ని తొలగిస్తుంది. శరీరం యొక్క శారీరక సమతుల్యత సాధ్యమవుతుంది. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది, చర్మంపై మెరుపును పెంచుతుంది, మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు నిద్రలేమి, ఆందోళనను కూడా తొలగిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
పంచకర్మ చికిత్సలో ధ్యానం మరియు యోగా ఒక అంతర్భాగం. కండరాలు మరియు బలాన్ని పునర్నిర్మించడంలో ధ్యానం మరియు యోగా గణనీయంగా సహాయపడతాయి. ఇది శరీర మూలల్లో దాగిన విషాన్ని మరియు హానికరమైన వ్యర్ధాలను కూడా విడుదల చేస్తుంది. యోగా మరియు ధ్యానం చేయడం వీటిని దినచర్యలో అమలు చేయడం కూడా మానసిక ఆరోగ్యం ను మెరుగుపరుస్తుంది.
నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
పంచకర్మ యొక్క ఆయుర్వేద ప్రక్రియలో భాగంగా, నాడీ విశ్లేషణ ద్వారా శరీరంలోని త్రిగుణాలు (వాత, పిత్త, కఫ దోషాలు) లోని అసమతుల్యత గురించి పంచకర్మ అద్భుతమైన పలితాన్ని ఇస్తుంది. త్రిగున దోషాల వల్లనే శరీరం అనారోగ్యం పాలవుతుందన్న విషయం ఆయుర్వేదం తెలిసిన అందరికి తెలిసిన విషయమే.
నిద్రను మెరుగుపరుస్తుంది
ఒత్తిడి కారణంగా ఏర్పడే అసమతుల్యతలలో నిద్రలేమి ఒకటి అని చెప్పవచ్చు. పంచకర్మ చికిత్స పురాతన ఆయుర్వేదంలో చెప్పబడిన మసాజ్ లు, స్వేదనం క్రియ మొదలైనవి శరీరానికి స్వాంతనను చేకూర్చి తద్వారా మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. ఉత్తమ పంచకర్మ చికిత్సలో వివిధ రకాల మసాజ్, రిలాక్సేషన్ థెరపీలు మరియు ధ్యానం ఉంటాయి, ఇవి సహజ నిద్రను ఉత్తేజం చేస్తాయి.
పంచకర్మ వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
◆ వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది
◆ శరీరంలో ఇబ్బందిగా ఉన్న అవయవ వ్యవస్థను ఉత్తేజపరిచి సమస్యను మూలాల నుండి తొలగిస్తుంది.
◆ జీర్ణ రసాల బలాన్ని పెంచుతుంది
◆ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
చివరగా….
పంచకర్మ అనేది గొప్ప ప్రాచీన వైద్యం కాబట్టి ఉత్తమమైన అనుభవ వైద్యుల పర్యవేక్షణలోనే వైద్యం చేయించుకోవడం మంచిది. దీనిద్వారా ఎలాంటి జబ్బుకు అయినా శాశ్వత పరిష్కారం లభించి శరీరం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లకు గురి కాదు కాబట్టి. ఇది ఎంతో ఆరోగ్యవంతమైన ప్రక్రియ.