ప్రస్తుతం అందరిని ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య బాడీ షేమింగ్. అంటే మంచి రంగు లేకపోవడం, అందంగా లేకపోవడం వంటి కారణాల వలన అందరూ చూసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్లందరికీ మళ్లీ అలా మాట్లాడకుండా ఉండాలంటే ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. ఈ చిట్కా ఉపయోగించడం వలన ఎంత నల్లగా ఉన్న వారైనా సరే తెల్లగా మెరిసిపోతారు. అసలు ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఆయిల్ తయారు చేసుకోవచ్చు.
ఈ ఆయిల్ ఉపయోగించడం వలన మీ చర్మం రంగు మునుపటికంటే మెరుగుపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు మేము నల్లగా ఉన్నాము తెల్లగా రావాలి అని అనుకునేవారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా బాగా కడిగి పక్కన పెట్టుకున్న నిమ్మకాయలు తీసుకోవాలి. గ్రేటర్ సహాయంతో పై తొక్క మాత్రమే వచ్చే విధంగా తురుముకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అర కప్పు బాదం నూనె వేసుకోవాలి.
దానిలో మనం తురిమి పక్కన పెట్టుకున్న నిమ్మకాయ తొక్కలను కూడా వేసుకోవాలి. గిన్నె స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు నూనె మరగనివ్వాలి. నిమ్మతొక్కలు నల్లగా అయ్యేంతవరకు నూనెను మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లారనివ్వాలి. తర్వాతే ఏదైనా గాజుసీసాలో నూనె వడకట్టుకొని వేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోవాలి. ముఖం, కాళ్లు, చేతులు, మెడ వంటి నల్లగా ఉండే ఏ భాగంలోనైనా సరే ఈ నూనె అప్లై చేసుకోవచ్చు.
ఈ నూనె అప్లై చేసిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నేను నేను ఈ విధంగా వరుసగా ఏడు రోజులపాటు అప్లై చేసినట్లయితే మీ చర్మం మునపటి కంటే తెల్లగా మెరిసిపోతుంది. ఈ నూనెను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిలో మంచి ఫలితం రావడం కోసం ఒక చెంచా జోజోబా ఆయిల్ కలుపుకోవాలి. ఈ ఆయిల్ సూపర్ మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ లభిస్తుంది. ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది. నల్లగా ఉన్నాము అని బాధ పడే వారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది.