lemon water for weight loss recipe

ఇలా నిమ్మరసం చేసుకుని తాగితే 15 రోజుల్లో పది కేజీల బరువు తగ్గుతారు

 అధిక బరువు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం అందరికీ చాలా కష్టమైన పనిగా మారింది. శరీరంలో కొవ్వు పెరుగుతుంటే  మనకు తెలియకుండానే  శరీరంలో చాలా అనారోగ్యాలు వస్తాయి. ఏదో ఒకరోజు హాస్పిటల్  బారిన పడటం ఖాయం. శరీరంలో ఉండే అధిక బరువు లేదా కొవ్వును తగ్గించుకోవడం ఎలాగో  ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో కొవ్వు ని ఎలా తగ్గించుకోవాలి  శరీరాన్ని ఎలా డీటాక్స్  చేసుకోవాలి  తెలుసుకుందాం. దీనికి కావాల్సిన మొదటి పదార్థం నిమ్మకాయ. 

సహజంగా అధిక బరువు తగ్గించుకోవడానికి  నిమ్మకాయ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నిమ్మకాయలో  విటమిన్ సి   సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి కాబట్టి  శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. నిమ్మరసాన్ని సరైన పద్ధతిలో తీసుకోనన్ని రోజులు ఎలాంటి  ఫలితం కనిపించదు. సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే బరువు తగ్గుతారు.   అధిక బరువుతో పాటు ఇంకా చాలా అనారోగ్యాలు  తగ్గించుకోవడం ఎలాగా ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మరసం తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఎవరైతే పచ్చళ్ళు, కారం, మసాలాలు, బయట ఆహారం,   జంక్ ఫుడ్ తీసుకుంటారో  వాళ్లు తప్పనిసరిగా నిమ్మరసం తీసుకోవాలి. 

నిమ్మకాయ శరీర  మెటబాలిజం రేటు  పెంచి సిట్రిక్ యాసిడ్  శరీరంలో ఉండే అధిక కొవ్వును తగ్గిస్తుంది. ఎలా తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.  నిమ్మ రసం తయారు చేసేటపుడు  చేసే పొరపాట్లు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఎండాకాలంలో  పంచదార కలిపిన నిమ్మరసం తీసుకోవాలి. దీనివలన  ఎండాకాలంలో రిలాక్స్డ్ గా  ఉంటుంది. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు పంచదార వేసుకోకూడదు.  పంచదార బదులు తేనె కలుపుకోవాలి. పంచదార ఇంకా బరువు పెరిగేలా చేస్తుంది. బాగా  వేడిగా ఉన్న నీటిలో కలపకూడదు. గోరు వెచ్చటి నీళ్లలో మాత్మే  కలుపుకోవాలి.తేనె నిమ్మరసం కలిపిన నీటిని వేడి  చేయకూడదు.వేడి చేస్తే పోషక విలువలు తగ్గిపోతాయి.

నిమ్మరసంలో ఉండే పోషక  విలువల కంటే తొక్కలో ఉండే పోషక విలువలు ఎక్కువ. అంటే పది నిమ్మకాయ రసం లో ఉండే పోషక విలువలు ఒక నిమ్మకాయ తొక్క లో ఉంటాయి. నిమ్మకాయ తొక్క బరువు తగ్గడానికి క్యాన్సర్  కొలెస్ట్రాల్  తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఒక పెద్ద సైజు  నిమ్మకాయ తీసుకుని  ఫీలర్ సహాయంతో   పసుపు చర్మాన్ని తీసుకుని ఒక గ్లాస్ లో వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పావు లీటర్ వాటర్ పోసుకుని  మరిగించుకోవాలి. ఈ వేడి నీటిని నిమ్మతొక్కలు వేసిన  గ్లాస్లో వేసి మూత పెట్టుకోవాలి. నీరు గోరువెచ్చగా అయిన తర్వాత దానిలో టేబుల్  స్పూన్ ఆర్గానిక్  తేనె కలుపుకోవాలి. 

ఈ రసాన్ని పరగడుపున తీసుకోవడం వలన  కొలెస్ట్రాల్ ఇంకా అధిక బరువు తగ్గిస్తాయి. ఎసిడిటి ఉన్నవారు మాత్రం ఖాళీ కడుపున తీసుకోకూడదు. సాయంత్రం తీసుకోవాలి.  శరీరాన్ని  డిటాక్స్  చేయడంలో ఈ  జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. నిమ్మరసం ఈ పద్ధతిలో తీసుకున్నట్లయితే అదిక బరువు శరీరంలో కొవ్వు ఈజీగా తగ్గుతాయి.

Leave a Comment

error: Content is protected !!