Lighten-Skin-on-Hands-and-Feet

ఇలా చేస్తే ఎంత నల్లగా ఉన్న కాళ్ళు అయినా సరే పది నిమిషాల్లో తెల్లగా వచ్చేస్తాయి

చాలా  మందికి సన్ టాన్  వల్ల, దుమ్ము, ధూళి వలన కాళ్లు చేతులు మెడ వంటి బయట కనిపించే భాగాలు నల్లగా మారిపోతాయి. ఎక్కువగా బయట పనులకు వెళ్లే వారికి ఇలా  అవుతుంది. బట్టలు ఉన్న భాగంలో తెల్లగా మిగిలిన భాగం నల్లగా ఉంటుంది. ఇలా ఉండడం వలన చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నలుపు పోగొట్టుకోవడానికి కెమికల్స్ ఉండే  ఎటువంటి క్రీమ్స్ ఉపయోగించనవసరం లేకుండా నాచురల్ గా తెల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బకెట్లో వేడినీళ్లు తీసుకొని దానిలో ఒక నిమ్మచెక్క రసం వేసుకుని ఒక పది నిమిషాలపాటు కాళ్లు నీటిలో పెట్టి ఉంచాలి. 

      తర్వాత బయటకు తీసి తడి తుడుచుకున్న తర్వాత బాగా పండిన  టమాటో జ్యూస్ ను ఒక బౌల్లో తీసుకోవాలి.  టమాటా జ్యూస్  సన్ టాన్ రిమూవ్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. చర్మం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోవాలంటే టమాటో జ్యూస్ ఉపయోగపడుతుంది. దీనిలో అర చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం కూడా సన్ టాన్ పోగొట్టి చర్మం తెల్లగా, కాంతివంతంగా అవుతుంది. తరువాత దీనిలో ఒక చెంచా బియ్యప్పిండి  వేసుకోవాలి. బియ్యప్పిండి స్కిన్ వైట్నింగ్ కు  చాలా బాగా సహాయపడుతుంది. 

         తర్వాత దీనిలో పావు చెంచా బేకింగ్ సోడా కూడా  వేసుకోవాలి. బేకింగ్ సోడా చర్మంపై ఉండే జిడ్డు, మురికి రిమూవ్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. వీటన్నిటినీ బాగా కలుపుకొని చర్మం నల్లగా అయిన భాగంలో అప్లై చేసుకోవాలి. కొంచెం మందంగా అప్లై చేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత నిమ్మచెక్క సహాయంతో ఈ ప్యాక్ అప్లై చేసుకున్న చోట స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఒక్కసారికే రిజల్ట్ కనిపిస్తుంది.

      ఇలా వారానికి ఒక సారి చేయడం వలన కాళ్లు, చేతులు, మెడ వంటి భాగాల్లో నలుపు మొత్తం పోయి తెల్లగా ఉంటుంది. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించలేదు  కాబట్టి ఈ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిట్కాను అన్ని వయసుల వారూ ఉపయోగించుకోవచ్చు. ఆడవారు, మగవారు కూడా ఈ చిట్కాను ఉపయోగించవచ్చు. ఎన్నో రకాల క్రీములను, చిట్కాలను ట్రై చేసి  మాకు ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్న వారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!