మన శరీరంలో లివర్ చాలా ముఖ్యమైన అవయవం. ఇది మన శరీరంలో చేరిన మలినాలను ఫిల్టర్ చేసి వ్యర్ధాలను తీసేస్తుంది. ఇలా లివర్లో ఉండేకొద్దీ మలినాలు పేరుకుపోయి లివర్ పనితీరు కుంటుపడుతుంది. దాని వలన శరీరంలో వందకుపైగా రోగాలు విజృంభిస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు లివర్ని శుభ్రపరుచుకుంటూ ఉండాలి. దానికోసం మసాలాలు, జంక్ఫుడ్ తగ్గించాలి. దాల్ రైస్, బ్రౌన్ రైస్, ఓట్స్ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
అంతేకాకుండా నీళ్లు ఎక్కువగా తాగడం రోజులో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం కూడా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకున్న మలినాలు బయటకు పోతాయి. అంతే కాకుండా ఇంకో రెండు చిట్కాల ద్వారా లివర్ లో పేర్కొన్న వ్యర్ధాలను బయటకు పంపించవచ్చు. అందుకోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు సొరకాయ ముక్కలు, పసుపు, నిమ్మకాయ రసం, బ్లాక్ సాల్ట్, కొత్తిమీర, తిప్పతీగ రసం.
ఈ జ్యూస్ శరీరంలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. జీర్ణాశయాన్ని బలంగా తయారు చేస్తుంది. లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. లివర్లోని చెడువ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. సొరకాయ, కొత్తిమీర మిక్సీ పట్టుకొని ఇది ఒక్క గ్లాస్ జ్యూస్ తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ నిమ్మరసం 30ml తిప్పతీగ రసం తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి పరగడుపున తాగడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుంది, శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు లివర్ నుండి బయటకు వెళ్లిపోతాయి.
వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను తొలగిస్తాయి. శరీరంలో లివర్ పనితీరు చాలా బాగా మెరుగుపడుతుంది. తర్వాత చెప్పుకొనే చిట్కా ముల్లంగి ఆకులు. మనం ముల్లంగి తీసుకున్నప్పుడు వాటి ఆకులను బయట పారేస్తాం. కానీ ఈ ఆకుల్లో ఉండే గుణాల వలన లివర్ ని చాలా బాగా శుభ్రం చేస్తాయి. ముల్లంగి జ్యూస్ శరీరానికి సంజీవనిలా పనిచేస్తుంది. లివర్ సామర్ధ్యాన్ని పెంచడంలో చాలా బాగా సహాయపడుతాయి. ముల్లంగి ఆకుల జ్యూస్లో రుచికోసం బీట్రూట్, అల్లం కూడా కలుపుకోవచ్చు.
వీటిని మిక్సీ పట్టి ఈ జ్యూస్ తీసుకోవడం వలన దృష్టి లోపాలు, వెంట్రుకలు రాలడం, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అంతర్గతంగా ఉన్న విష వ్యర్ధాలను తొలగించి శరీరాన్ని కాంతివంతంగా కూడా చేస్తాయి. ఇలా క్రమం తప్పకుండా 7 రోజులు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కిస్మిస్ నీటితో సహా తీసుకోవడం వలన కూడా లివర్ని శుభ్రపరుచుకోవచ్చు. కనీసం వారంలో కొన్ని రోజులైనా ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల లివర్ రిపేర్ చేసుకుంటుంది.