కొంతమందికి నిత్యం కాస్త ఎక్కువ మోతాదులో కానీ లేదా తక్కువ మోతాదులో గాని మద్యం తాగే అలవాటు ఉంటుంది. వీరు ఎంతమంది చెప్పినా ఆల్కహాల్ ని వదలము అంటారు. వారికి అటువంటి బలహీనత ఉంటుంది. వారిని ఎవరు మార్చలేరు. కానీ మద్యం వలన లివర్ డ్యామేజ్ అవుతుంది అని, భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని అందరూ భయపడుతూ ఉంటారు. ఇలాంటి ఆల్కహాల్ తాగేవారు ఇంచుమించు 500 ml గ్రేప్ జ్యూస్ కనుక తాగితే ఆల్కహాల్ వల్ల వచ్చే డామేజ్ ను చాలా వరకు క్లియర్ చేయగల సామర్థ్యం ఈ గ్రేప్ జ్యూస్ కు ఉంది.
మద్యం తాగి ఇవి తాగుతారా, లేదా ఇది తాగి మద్యం తాగుతారా లేదా రోజు సాయంత్రం నాలుగు గంటలకు సమయంలో గ్రేప్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటారా అనేది మీ ఇష్టం. గ్రేప్ జ్యూస్ లో ఉన్న వాస్తవం ఏంటి అంటే 500 ml జ్యూస్ లో నిరింజీన్, నిరంజనెనీన్ అనే రెండు రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇది ఆఫ్ లీటర్ జ్యూస్ లో 300-375mg వరకు ఈ కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటి వలన ప్రధానంగా మూడు లాభాలు కలుగుతాయి. ముందుగా లివర్ కణాలో ఇన్ఫ్లమేషన్ రాకుండా నిరీంజీన్ మరియు నిరంజనెనీన్ అనేవి కాపాడతాయి.
దీని వలన సెల్ స్ట్రక్చర్ పాడవదు. ఇక రెండవదిగా ఆల్కహాల్ తాగే వారిలో కొన్ని రోజులకు ఎస్టీఓటి, ఎసీపిటి బాగా పెరిగిపోతుంది. దీనివలన లివర్ సెల్ డామేజ్ అయి కణం లోపల ఉండే సైటోప్లాజం లిక్విడ్ బయటకు వచ్చేస్తుంది. దీని వల్ల లివర్ కణాలు డామేజ్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల లివర్ గడ్డ కట్టినట్టుగా అయిపోతుంది. ఈ స్టేజ్ కి లివర్ కణాలు రాకుండా సెల్ వాల్ బ్రేక్ అవ్వకుండా దాన్ని సంరక్షించడానికి ఈ రెండు కెమికల్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ జ్యూస్ వలన మూడో లాభం ఏ డి హెచ్ ఎంజైమ్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది.
ఇది ఆల్కహాల్ ను బాగా స్పీడ్ గా విడగోడుతుంది. అందువలన దీని వలన లివర్ పై ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా లివర్ డ్యామేజ్ కాకుండా సంరక్షిస్తుంది. ఈ మూడు రకాల బెనిఫిట్స్ ఆల్కహాల్ తాగేవారికి గ్రేప్ జ్యూస్ వలన ఉంటుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది