long hair growth hair remedy

రాత్రి పూట ఇలా చేస్తే వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది

  ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం వలన జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంది. జుట్టు రాలడం ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి బాల్ హెడ్, కొందరికి సైడ్స్ జుట్టు లేకపోవడం, కొందరికి జుట్టు పలుచగా ఉంటుంది.   కొందరికి అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలను  తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్  ని ఉపయోగిస్తారు.

    కానీ ఇటువంటి మార్కెట్లో  దొరికే ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల వాటిలో ఉండే  కెమికల్స్ అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈ  చిట్కా ట్రై చేసినట్లయితే మీ జుట్టు  వారం రోజులలో ఆగకుండా పెరుగుతుంది. దీనికోసం ఒక  మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి గ్రేటర్ సహాయంతో మెత్తగా తురుముకోవాలి. లేదా మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 

         తర్వాత ఒక రెండు లేదా మూడు ఇంచులు అల్లం ముక్కల్ని తీసుకుని శుభ్రంగా కడిగి దానిని కూడా గ్రేటర్ సహాయంతో తురుముకోవడం లేదా మెత్తగా పేస్ట్ చేసుకోవడం చేయాలి. అల్లం మరియు ఉల్లిపాయ పేస్ట్ ను ఒక కాటన్ క్లాత్ వేసి జ్యూస్ ని వడకట్టుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా బ్లాక్ క్యాస్ట్రాయిల్ వేసుకోవాలి. బ్లాక్ కాస్టర్ ఆయిల్ లేకపోతే మామూలు ఆముదం ఒక చెంచా వేసుకోవాలి లేదా రెండు విటమిన్ ఈ క్యాప్సిల్ లేదా ఒక చెంచా బాదం నూనె అయినా సరే వేసుకోవచ్చు. 

      వీటిని బాగా కలుపుకొని జుట్టు పొడవునా అప్లై చేయాల్సిన అవసరం లేదు. స్కాల్ప్ కి అప్లై చేస్తే సరిపోతుంది. అప్లై చేసిన తర్వాత ఒక గంట సేపు ఉండనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన ఉల్లిపాయ మరియు అల్లంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఐరన్, మేగ్నేషియం, సల్ఫర్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు జుట్టు రాలడాన్ని తగ్గి తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. తెల్ల వెంట్రుకలు నల్లగా మారిపోతాయి.  జుట్టు రాలడం, పేనుకొరుకుడు, బాల్ హెడ్, జుట్టు పల్చగా ఉండటం వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!