అందరికీ జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. జుట్టు రాలడం అనేది వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి వస్తుంది. దీనికి కారణం పోషకాహార లోపం, పొల్యూషన్, అనారోగ్య పరిస్థితులు, మానసిక ఒత్తిడి. కానీ ప్రతి ఆడపిల్లకి నా జుట్టు పొడవుగా ఉండాలని ఆశ ఉంటుంది. కానీ ప్రస్తుతం లో ఉన్న పరిస్థితుల వలన జుట్టు రాలిపోయే సన్నగా తోకలాగా అయిపోతుంది. జుట్టు రాలడం తగ్గాలంటే జుట్టుకు కావాల్సిన పోషకాలు అందించాలి.
మనం ఈ డ్రింక్ తయారు చేసుకుని ప్రతిరోజూ తాగినట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీనికోసం మనకు కావలసినవి పుచ్చ పప్పు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పులు, అంజీర, ఖర్జూరం. ఒక మనిషికి సరిపడినంత మిల్క్షేక్ తయారు చేసుకోవాలంటే అంజీర 1, ఐదు బాదం పప్పులు, ఒక చెంచా పొద్దుతిరుగుడు గింజలు, ఒక చెంచా పుచ్చ గింజలు, మూడు లేదా నాలుగు ఖర్జూరాలు. వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఉదయం చేసుకోవాలంటే రాత్రి నానబెట్టుకోవాలి.
సాయంత్రానికి అయితే ఉదయం నాన పెట్టుకుంటే సరిపోతుంది. ఖర్జూరాలను ఇష్టమైతే నాన్న పెట్టుకోవచ్చు లేదా విడిగా వదిలేయవచ్చు. వీటన్నిటినీ నీటితోపాటు మిక్సీ జార్ లో వేసుకొని ఒక గ్లాసు పాలు వేసుకోవాలి. పిల్లలకైతే మామూలు పాలు ఇవ్వచ్చు పెద్దవారు అయితే మిగతా తీసిన పాలను మాత్రమే వేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గ్లాసు లో వేసుకొని ఖర్జూరాలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో తీపి కోసం ఎటువంటి షుగర్స్ అవసరం లేదు.
ఎందుకంటే డ్రై నట్స్ లో ఆల్రెడీ స్వీట్ నెస్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఈ డ్రింక్ తాగినట్లయితే మీ శరీరానికి జుట్టుకు కావలసిన పోషకాలు అందుతాయి శరీరం లో నీరసం అలసట బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. పిల్లలకు కూడా ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి వల్ల జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఒత్తిడి ఏంటి అంటే స్కూల్ లో చదువుకోవడం, ఎగ్జామ్స్ అని వాటి గురించి ఆలోచిస్తూ ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు.
దాని వల్ల పిల్లల్లో జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ డ్రింక్ తయారుచేసుకొని ప్రతిరోజు తాగినట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మాకు జుట్టు పొడవుగా ఎదగాలి అనుకున్న వారందరూ ఒకసారి ఈ డ్రింక్ ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.