అధిక బరువు సమస్య తగ్గించుకోవడానికి మంతెన గారు చెప్పిన ఈ డైట్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకుందాం రండి. బరువు తగ్గడానికి తేనె నీళ్ల డైట్ ఆరు రోజులు పాటించడం వలన శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోయి త్వరగా బరువు తగ్గుతారు. దీనికోసం ప్రతిరోజు ఉదయం వ్యాయామంతో పాటు లీటరుప్పావు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వలన మన కడుపులో ప్రేగుల కదలికలు బాగా జరిగి మలబద్ధకం సమస్య నివారించబడుతుంది. సుఖ విరోచనం జరుగుతుంది. తర్వాత మళ్లీ లీటరుపావు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది రెండవసారి విరోచనం అవడానికి ఉపయోగపడుతుంది.
తర్వాత ఒక గ్లాస్ నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. నిమ్మరసం తాగలేని వారు తేనె నీటిని తీసుకోవచ్చు. పావు గంట తర్వాత ఒక గ్లాసు మాములు నీటిని మళ్లీ అరగంటకు తేనె నీటిని తాగాలి. ఇలా రోజులో కనీసం 200 గ్రాముల తేనెతో నీటిని తాగాలి. ఆ ఆరు రోజుల పాటు కేవలం తేనె నీరు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన కనీసం మూడు నాలుగు కేజీల బరువు తగ్గుతారు. ఆరు రోజుల తర్వాత ఈ పద్ధతిని ఆపేసి ఫ్రూట్ జ్యూస్ డైట్ చేయాలి. ఫ్రూట్ జ్యూస్ కోసం కేవలం స్వచ్ఛమైన పండ్లరసాలు మాత్రమే తీసుకోవాలి. పాలు పంచదార కలిపిన మిల్క్ షేక్లు తాగకూడదు. ఉదయం 10:30 వరకు నీటిని తాగి విరోచనం అయిన తర్వాత ప్రతి మూడు గంటలకు ఒకసారి కమలా, బత్తాయి, చెరుకు రసం వంటి జ్యూస్లను నాలుగు సార్లు తీసుకోవాలి.
ఎనిమిది గంటలకు డైట్ మొదలు పెడితే 5 సార్లు వరకు తీసుకోవచ్చు. ఈ జ్యూస్ డైట్ చేసేటప్పుడు సాయంత్రం ఏడు గంటలకల్లా ఆకరి జ్యూస్ తీసుకుని ఆపేయాలి. ఈ డైట్ తొమ్మిది రోజుల వరకు చేయాలి. ఇలా చేయడం వలన కనీసం రెండు నుండి మూడు కేజీల బరువు తగ్గుతారు. తర్వాత ఫ్రూట్ డైట్ అంటే కేవలం పండ్లను మాత్రమే తీసుకొని డైట్ చేయాలి. దీని కోసం ఆరు రోజుల పాటు కేవలం మూడు పూట్ల పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బొప్పాయి, కర్బూజా పండ్లతో పాటు ఒక అరటి పండు తీసుకోవచ్చు. అలాగే కడుపు నిండుగా ఫ్రూట్స్ తినొచ్చు. ఇలా ఆరు రోజుల పాటు చేసిన తర్వాత మిగతా తొమ్మిది రోజుల కోసం ఉదయాన్నే లీటరుపావు నీటితో మలవిసర్జన పూర్తి చేయాలి.
తర్వాత పదిన్నరకు ఒక గ్లాస్ జ్యూస్ తాగాలి. తర్వాత బ్రేక్ ఫాస్ట్ గా పండ్లతో మొలకలు తీసుకోవాలి. మధ్యాహ్న ఆహారంగా ఏమి తీసుకోకూడదు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు గంటకు ఒక గ్లాసు నీటిని తాగాలి. సాయంత్రం ఆహారంగా ఒక జ్యూస్ తీసుకోవాలి. అలాగే ఒక పది చొప్పున నాలుగైదు రకాల డ్రై నట్స్ తీసుకోవచ్చు. ఇలా నెల మొత్తం ఈ డైట్ పాటించడం వలన ఒక నెలలో కనీసం ఆరేడు కేజీల బరువు తగ్గుతారు. అధికంగా బరువు ఉన్నవారైతే 10 కేజీలు తప్పకుండా బరువు తగ్గుతారు. తరువాత కూడా మితంగా సహజ ఆహారం తీసుకోవడం వలన బరువు పెరగకుండా అడ్డుకోవచ్చు.