మనం తినే ఆహారం సరిగా జీర్ణం అవ్వక పోతే అది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. గ్యాస్ ఎక్కువగా పేరుకుపోవడం వలన దుర్గంధంతో కూడిన చెడు గ్యాస్ బయటకు వస్తూ ఉంటుంది. ఇది అందరిలోకి వెళ్లేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు సమస్య, మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు వంటి సమస్యలు కూడా ఒకదాని వెనుక ఒకటి వస్తుంటాయి. ఇప్పటి కాలంలో మనం తినే ఆహారాలు జంక్ ఫుడ్, మాంసాహారం, మసాలాలతో పేరుకుంటున్నాయి. వీటిని వీలైనంత తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన ఈ సమస్యను తగ్గించవచ్చు. అలాగే ఒక మంచి హెల్త్ డ్రింక్ తాగడం వలన ఈ చెడు గ్యాస్ ఆహారం జీర్ణం అవ్వక పోవడాన్ని తగ్గించవచ్చు.
దీని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని దానిలో సోంపు గింజలను ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి రాత్రంతా అలాగే నాననివ్వాలి. మరుసటి రోజు ఈ నీటిని వడకట్టి ప్రతి రోజు టిఫిన్ చేసిన తరువాత తాగడం వలన చిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మూలికా నిపుణుల అభిప్రాయం ప్రకారం, సోంపు గింజలు జీర్ణక్రియకు సమర్థవంతమైన సహాయం చేస్తాయి. ఇది జీర్ణశయాంతర వ్యవస్థ యొక్క మృదువైన కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి మరియు గ్యాస్, ఉబ్బరం మరియు కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
పుష్కలమైన డైటరీ ఫైబర్‌తో ధనియాలు గింజలు ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించే జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారాన్ని తరలించేలా చేస్తాయి. విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జీర్ణ రసాలను విడుదల చేయడాన్ని ప్రోత్సహిస్తాయి. అంతేకాదు, కొత్తిమీర గింజలు జీర్ణ కండరాలను రిలాక్స్ చేస్తాయి, నొప్పి మరియు గ్యాసీనెస్ నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇలా కనీసం ఏడు రోజుల పాటు ఈ డ్రింక్ తాగడం వలన పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కూడా కరిగిపోతుంది. చెడువాయువు విడుదల తగ్గుతుంది. ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.