Low Calorie Healthy Snack Recipe

మరమరాలతో తయారు చేసిన కమ్మని టిఫిన్ ..!

పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే స్నాక్ మరమరాలు. అలాంటి మరమరాలు ఇంకా ఇష్టంగా తినాలి అంటే ఈ రెసిపీని చేస్తే సరిపోతుంది. పిల్లలు బాగా ఇష్టపడేలాగా పిల్లలు చక్కగా వద్దు అనకుండా ఉండే రెసిపీ మరమరాలు. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరమరాలు అంటే న్యాచురోపతి విధానంలో చాలా రుచికరమైన ఆహారంగా చెప్పవచ్చు. 100 గ్రాముల మరమరాలు తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ మరమరాలల్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. వీటిలో విటమిన్ B, విటమిన్ D తో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

                   ఈ పోషకాలు అన్నీ బలమైన దంతాలు, ఎముకలు ఏర్పడడానికి బాగా సహాయపడతాయి. ఈ మరమరాలు కరకరలాడుతూ లైట్ సాల్ట్ గా ఉంటాయి. నోట్లో పెడితే కరిగిపోతూ ఉంటాయి. అలాంటి మరవరాలతో ఏ స్నేక్ చేసిన, ఏ టిఫిన్ చేసినా కమ్మగా ఉంటాయి. అందుకని నూనె లేకుండా, పిల్లలకి హాని కలగకుండా ఉప్పు లేకుండా మరమరాల టిక్కీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మరమరాల టిక్కీకి కావలసిన పదార్థాలు. మరమరాలు ఒకటిన్నర కప్పు, ఉడకబెట్టిన బంగాళదుంపలు నాలుగు, శనగపిండి పావు కప్పు ఉల్లిపాయ చిన్న ముక్కలు పావు కప్పు, పచ్చిమిర్చి చిన్న ముక్కలు వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి.

                మీగడ వన్ టేబుల్ స్పూన్, సాంబార్ మసాలా వన్ టేబుల్ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా ముందుగా మరమరాళ్లు ఒక బౌల్ లోకి తీసుకుని తడిపి  ఒక పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టిన బంగాళాదుంపల్ని ఒక బౌల్లో వేసి మెత్తగా చిదిమెయ్యాలి. దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు, సాంబార్ పొడి, చాట్ మసాలా  పొడి వేసేసి, మరమరాలు కూడా దీనిలోనే వేసేసి శెనగపిండి కూడా దానిలో వేసేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే మరమరాల టిక్కికి కావలసిన మిశ్రమం సిద్ధమైపోతుంది. మనకు కావాల్సిన సైజులో మరమరాల టిక్కీల పిండిని ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి.

                 నాన్ స్టిక్ పాన్ పైన మీగడ  రాసేసి దానిపైన ఈ టిక్కిలను ఉంచాలి. వీటిని సన్నసెగ మీద బాగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ మరమరాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. మరమరాలతో చేసిన ఈ టిక్కీలు   మెత్తగా, సాఫ్ట్ గా ఉంటాయి. ఈ మరమరాలు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.

Leave a Comment

error: Content is protected !!