Low Calorie Keera Fry Salad Reduces Weight

కీరా ఫ్రైడ్ సలాడ్……. పొట్టనిండా తిన్నా సరే పొట్ట తగ్గుతుంది కానీ పెరగదు…….. బరువు కూడా తగ్గుతారు……

కిరాతో సాధారణంగా సలాడ్స్ చేసుకొని డ్రై రూపంలో మాత్రమే తింటారు. కానీ ఇలా పచ్చిగా తినమంటే అందరూ ఇష్టపడటం లేదు. కీర అంటే జీరో క్యాలరీ వెజిటేబుల్. దీనిని ఫ్రై చేసినప్పుడు దీనిలో ఉన్న నీటి శాతం తగ్గి మనం వేసే పదార్థాలు వలన కమ్మటి రుచి వస్తుంది. క్యాలరీలు రావు, పొట్ట మొత్తం ఫీల్ అవుతుంది. మంచి ఫైబర్, చాలా రకాల పోషకాలు మరియు మంచి మినరల్స్ కూడా లభిస్తాయి. కనుక ఇటువంటి లాభాలు ఫ్రై ద్వారా ఎలా పొందాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం.

                    కీరా ఫ్రైడ్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం. కీర దోసకాయ ఒకటి, నిమ్మరసం రెండు స్పూన్లు, తేనె ఒక స్పూన్, వేపించిన నువ్వులు ఒక టేబుల్ స్పూన్, ఓరిగానో వన్ టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, మిరియాల పొడి ఒక టీ స్పూన్, మిగడ ఒక టీ స్పూన్, ఎండుమిరపకాయ చెక్క ముక్క పొడి ఒక టీ స్పూన్, ఇప్పుడు కీర ఫ్రైడ్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా కిరను చివర్లు కోసివేసి మధ్యభాగాన్ని చిన్న చిన్న చీలుకలుగా కోసుకోవాలి. మధ్యలో ఉన్న విత్తనాలను తీసివేయాలి.

                          ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఒరిగానో వేసుకొని ఒక స్పూన్ మిగడ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండు మిరపకాయలు చెక్క ముక్క పొడిని వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన పచ్చిశనగపప్పుని వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి,ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి అందులో కీర ముక్కలు వేయాలి. కిర ముక్కలు ఇందులో ఉండే తేమతో మగ్గ నివ్వాలి.

                         ఆ తర్వాత ఏదైనా గిన్నెలోకి తీసుకుని పైన వెయించిన నువ్వులతో డ్రెస్సింగ్ చేసుకోవాలి. టెస్టీ కిర ఫ్రైడ్ సలాడ్ రెడీ అవుతుంది. కిరలో జీరో క్యాలరీస్ ఉంటాయి. అందువల్ల ఎంత తిన్నా ఫ్యాట్ రాదు. అంతేకాకుండా జీరో ఫైబర్, జీరో ప్రోటీన్ ఉంటుంది. కనుక ఇది తేలికగా జీర్ణం అయిపోతుంది. కనుక ఇటువంటి వాటిని రోజు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పోషకాలు లభించడంతోపాటు కడుపు కూడా ఫుల్ అవుతుంది…

Leave a Comment

error: Content is protected !!