విటమిన్ D అనేది ఎముక పుష్టికి మనం తిన్న ఆహారం ప్రేగుల నుండి గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఎండ తగలకపోవడం వల్ల డి విటమిన్ లోపం వస్తుంది. చాలామందికి ఈ లోపం ఉందో లేదో తెలియదు. ఈ విటమిన్ లోపం వల్ల ఎముకలు గుల్ల బారడం, అరిగిపోవడం కాకుండా ఆటో ఇమ్యున్ డిసార్డర్ వచ్చే అవకాశం ఉంది. అంటే రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేసి మనల్ని ఇబ్బంది పడేలా చేస్తాయి. ఈ రోజుల్లో చాలామందికి ఈ డిసార్డర్స్ వస్తున్నాయి. మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తికి మరియు వాటిని కంట్రోల్ చేయడానికి విటమిన్ డి కావాలి. బోన్ మారో నుంచి తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి.
తెల్ల రక్త కణాలు అనేవి రక్షక దళాలు. ఈ డి విటమిన్ అనేది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి వాటిని రెగ్యులేట్ చేయడానికి అవసరం. ఇది తెల్ల రక్త కణాలు లోపలికి వెళ్లి వాటి యొక్క పనితీరుని మెరుగుపరచడానికి, తెల్ల రక్త కణాలు అతిగా స్పందించకుండా రక్షణ వ్యవస్థ అతిగా దాడి చేయకుండా కంట్రోల్ చేయడానికి డి విటమిన్ ఉపయోగపడుతుంది. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కి ఎలా దారి తీస్తుందంటే తెల్ల రక్త కణాలు అతిగా స్పందించి నప్పుడు టి.ఎన్.ఎఫ్ ఆల్ఫా, ఇంటర్ లూకిన్స్, సైటోకైన్స్ అనే కెమికల్స్ ని ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేసేస్తాయి. దీనివల్ల ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు రకాల కెమికల్స్ ని విటమిన్-డి అడ్డుకొని మనకు రక్షణ కలిగిస్తుంది.
కాబట్టి ఈ డిజార్డర్ రాకుండా విటమిన్ డి ఉపయోగపడుతుంది. 8సంవత్సరాల నుండి వయసు పైబడిన వారందరూ విటమిన్-డి టెస్ట్ చేయించుకుంటే 100కి 90 మందికి విటమిన్ డి లోపం ఉంటుంది. ఎండ తగిలితే విటమిన్ డి వస్తుంది కాబట్టి ఉదయం 8 గంటల నుండి 1 లోపు ఎండలో అల్ట్రా వైలెట్ బి రేసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ బీ రేసెస్ ఎక్కువగా ఉన్నప్పుడే విటమిన్ డి చర్మం నుండి తయారవుతుంది. విటమిన్ డి కి ఎండ ఒక సోర్స్, అలా ఎండలో ఉండడం కుదరదు అనుకుంటే డాక్టర్ సలహా మేరకు విటమిన్ డి టాబ్లెట్స్ తప్పనిసరిగా వాడాలి. విటమిన్ డి లోపం తగ్గే వరకు వారానికి ఒక టాబ్లెట్ వేసుకోవాలి.
కంట్రోల్ అయిన తర్వాత నెలకొక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అలాంటి డి విటమిన్ రక్షణ వ్యవస్థని కంట్రోల్ చేసి ఆటో ఇమ్యున్ డిసార్డర్స్ రాకుండా కాపాడుతుంది.