ఇప్పటి రోజుల్లో జుట్టు రాలే సమస్య ఆడవారిలో, మగవారిలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా జుట్టు రాలే సమస్య ఎక్కువ అయితే పాపిట నుండి జుట్టు పలచబడి బట్టతల అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మనం ఇప్పుడు ఒక సింపుల్ అండ్ పవర్ ఫుల్ చిట్కా తెలుసుకుందాం.
ఈ చిట్కాలోని పదార్థాలు జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు బలంగా పెరిగేలా చేసేందుకు సహకరించదు స్తాయి. దాని కోసం మనం రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి. వీటిని మెత్తగా తురుముకొని లేదా పేస్ట్ చేసుకొని ఒక గుడ్డ సహాయంతో రసం పిండుకోవాలి. వడకట్టు కంటే ఇలా క్లాత్ ఉపయోగించడం వలన రసం ఎక్కువగా తీయవచ్చు. ఈజీగా అయిపోతుంది.
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో ఉల్లి జ్యూస్ బాగా సహాయపడుతుంది. అలాగే చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. తర్వాత ఇందులో రెండు స్పూన్ల మెంతుల పొడి వేసుకోవాలి. మెంతుల పొడి జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు దృఢంగా బలంగా పెరిగేందుకు సహాయపడుతుంది. దీనిలో ఉండే ఔషధ గుణాలు జుట్టు నల్లగా ఉండేందుకు, మృదువుగా పెరిగేందుకు సహాయపడుతాయి.
తరువాత ఇందులో రెండు స్పూన్ల ఆముదం నూనె వేసుకోవాలి. ఆముదం జుట్టు సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇది జుట్టు దృఢంగా చేయడంలో సహకరించి మూలాల నుంచి కుదుళ్ళను బలంగా చేస్తుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి.ఇలా నానిన మిశ్రమాన్ని ఒక గుడ్డ సహాయంతో వడకట్టుకొని వచ్చిన సీరంని జుట్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి.
మిగిలిపోయిన ఈ పేస్ట్ ను కావాలనుకుంటే జుట్టుకు ప్యాక్లా అప్లై చేసుకోవచ్చు. ఈ చిట్కా తలస్నానం చేసినా లేదా ఆయిల్ రాసుకున్న జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇరవై నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయవచ్చు. ఇలా కనీసం రెండు వారాల పాటు చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి, జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది. జుట్టు పెరుగుదల మెరుగవుతుంది.