ముఖం తెల్లగా యవ్వనంగా ఉండడానికి మనం చాలా రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాం. కానీ కొంతమందిలో మొటిమలు ఎక్కువగా ఉండి అవి మచ్చలుగా ఏర్పడుతుంటాయి. కొంతమందిలో మెలనిన్ ఎక్కువయ్యి ముఖంపై సీతాకోకచిలుక ఆకారంలో బుగ్గలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి రోజురోజుకు పెరుగుతూ ఉంటాయి. వీటికి చికిత్స కెమికల్ ఫీల్ లేజర్ చికిత్సలు చేస్తూ ఉంటారు. వీటి వలన ఫలితం ఉన్నా ఖరీదైనవి కావడం వలన అందరికీ అందుబాటులో ఉండవు.
వీటికి తక్కువ శ్రమతో ఇంట్లోనే చేసుకునే ఒక చికిత్స ఈ పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలను నివారించి ముఖాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. ఈ చికిత్సను రెండు భాగాలుగా విడదీయాలి. మొదటి దాంట్లో ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి. అలాగే పంచదార పొడి చేసుకుని విడిగా పెట్టుకోవాలి.దానతో అరచెక్క నిమ్మకాయ కూడా కావాలి. మొదట పెరుగును ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. తర్వాత ఇరవై నిమిషాలు గడిచాక అరచెక్క నిమ్మకాయతో పంచదార పొడి తీసి ముఖాన్ని స్క్రబ్ చేయాలి. ఇలా ముఖం మొత్తం చేసిన తర్వాత మామూలు నీటితో ముఖాన్ని కడగాలి.
తర్వాత ఒక స్పూన్ చందనం (శాండల్వుడ్) పౌడర్ తీసుకోవాలి. దానిలో ప్యాక్లా చేయడానికి సరిపడా బంగాళదుంప రసం వేసుకోవాలి. దానిలో చిటికెడు పసుపు కూడా వేసి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి మొటిమలు, పిగ్మంటేషన్ తొలగించడంతో పాటు మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ కెమికల్ ఫీల్ చేసే పనిని సమర్థవంతంగా చేస్తుంది.
పంచదార ముఖానికి మంచి ఎక్స్పాలియేట్ గా పనిచేసి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ముఖంపై ఉండే మృతకణాలను తొలగించి చక్కటి మెరుపును అందిస్తుంది. నిమ్మరసంలో విటమిన్-సి సమృద్ధిగా ఉండి ముఖంపై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. మంచి రంగు సొంతం చేసుకునేందుకు, మొటిమలు రాకుండా అడ్డుకునేందుకు నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఉపయోగించిన చందనం పొడి మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
ఇది చర్మాన్ని బిగుతుగా చేయడంలోనూ, యవ్వనాన్ని తిరిగి అందించడంలోనూ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. దీనిలో వేసిన బంగాళదుంప సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది ముఖాన్ని శాతాన్ని తగ్గించి కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చలు రాకుండా అడ్డుకుంటాయి. ముఖంపై ఏర్పడే ఇన్ఫెక్షన్లను తొలగిస్తాయి. ఇలా టిప్ ఉపయోగించి సహజంగానే మంగు, పిగ్మెంటేషన్, మొటిమలను తగ్గించుకోవచ్చు.
Great article , keep it up.