మహాబీర గింజలు గురించి తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి మహాబీర గింజలు. మోకాళ్ళ నొప్పులు అనేవి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు అంటే రెండు కీళ్ళు కలిసేచోట కీళ్ళమధ్యలో గుజ్జు తగ్గితే వస్తాయి. కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఆపరేషన్ అవసరం లేదు. నొప్పి తీవ్రంగా ఉండి నడవడానికి కూడా ఇబ్బంది అయినప్పుడు ఆపరేషన్ అవసరం పడుతుంది.
నొప్పి మరీ తీవ్రంగా లేనప్పుడు ఇంటిచిట్కాలు బాగా పనిచేస్తాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే చిట్కాతో సమస్య ను తగ్గించాలి. మహాబీర గింజలు నొప్పులను తగ్గిస్తాయి. కీళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు వయసుమీరిన వారిలో మాత్రమే ఉండేవి. ఇప్పుడు ముప్ఫై ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం, మారిపోతున్న జీవనశైలి ,ఆహారపుటలవాట్లు, అధికబరువు కీళ్ళనొప్పులకు కారణమవుతున్నాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
కీళ్ళమధ్యలో గుజ్జు పెరిగితే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. దానిని పెంచడానికి మహాబీర గింజలు పనిచేస్తాయి. మహాబీర గింజలను ఒక స్పూన్ తీసుకుని ఒక గిన్నెలో నీళ్ళు వేసి నానబెట్టాలి. గంట తర్వాత తీసుకుంటే సరిపోతుంది. రాత్రిపూట నానబెట్టి మరుసటిరోజు ఉదయం తీసుకోవాలి. ఈ గింజలు నానితే సబ్జా గింజల్లా ఉంటాయి. ఈ గింజలను నమిలి ఈ నీటిని తాగాలి.
ఈ గింజలను వడకట్టి విడివిడిగా తీసుకోవడం లేదా మిక్సీ పట్టి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. వీలైనంత వరకూ గింజలతో కలిపి తీసుకోవాలి. ఈ గింజలు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్లో మరియు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి.
అందరికీ అందుబాటుధరలో ఉండడంతో అందరూ వాడడం ఎక్కువయింది. వీటివలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సబ్జా గింజల కంటే కాస్త పెద్దగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ కె, ఐరన్, ఫైటో కెమికల్స్, ఫాలీపినాల్స్, ఫ్లెవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బీటా కెరోటిన్, లుటిన్, జియాక్సిన్, పొటాషియం, మాంగనీస్, రాగి,కాల్షియం, ఫొలేట్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఈ గింజలను చూస్తుంటే గుజ్జు లా ఉంటుంది. వీటిని తినడంవలన కీళ్ళమధ్యలో గుజ్జు పెరుగుతుంది. మహాబీర గింజలు కీళ్ళనొప్పులు తగ్గించడంతో పాటు శరీరానికి చలవచేస్తుంది. అధికబరువు ఉన్నవారు రోజూ తాగీతే కొవ్వు కరిగి సమస్య తగ్గుముఖం పడుతుంది. మహాబీర గింజలు తులసిజాతికి చెందినవి. మూడునెలల క్రమంతప్పకుండా వాడితే మోకాళ్ళలో గుజ్జు పెరిగి మోకాళ్ళనొప్పి సమస్య తగ్గుతుంది.
మోకాళ్ళ నొప్పులు మొదటిదశలో ఉన్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. మోకాళ్ళ మధ్య టక్టక్ మని శబ్దం వస్తే ఈ చిట్కా పాటించడం వలన గుజ్జు పెరిగి సమస్య తగ్గిపోతుంది. రోజు వాకింగ్ చేస్తూ మంచి ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచడం, డయాబెటిస్ , అధికబరువు నియంత్రణ కలిగిస్తాయి మహాబీర గింజలు. ఆకలి తగ్గి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మహాబీర గింజలను తీసుకుంటూ కీళ్ళు మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చు.