mahabeera seeds health benefits

ఇవి తీసుకుంటే అరిగిపోయిన మీ మోకాళ్ళు పుంజుకుని పరిగెడతారు

ఇప్పటి కాలం లో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఉపశమనం పొందుతున్నారు చాలా మంది. అయితే ఆ ఉపశమనం కేవలం తాత్కాలికమే. ఆ తరువాత ఆ నొప్పులు షరా మాములే అయిపోతున్నాయి. అలాంటి నొప్పులు మనం కేవలం ఆహారం తీసుకోవడం ద్వారా అధిగమిస్తే అది శాశ్వత పరిష్కారం అవుతుంది. అలాంటి అద్భుతమైన పరిష్కారపు కానుక ఈరోజు మీకోసం.

 ◆మహాబీర విత్తనాలు  అన్నిరకాల కిరాణా షాపుల్లో దొరుకుతాయి. ఇవి చూడటానికి నల్లగా, సబ్జా గింజల్లా ఉంటాయి. ఇవి తులసి జాతి మొక్కకు చెందిన విత్తనాలు.  ఈ మహాబీర విత్తనాలు తీసుకోవడం వల్ల కేవలం మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో అరిగిపోయిన గుజ్జు మాత్రమే కాకుండా బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో అసలు మహాబీర విత్తనాలను ఎలా తీసుకోవాలో. ఈ విత్తనాలలో ఉన్న పోషకాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.

◆ఈ విత్తనాలలో విటమిన్-డి, కాల్షియం, కాపర్, జింక్ మొదలైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని సమకూర్చడంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి. 

◆మహాబీర విత్తనాలు మోకాళ్ళ మధ్య గుజ్జు అరిగిపోయిన సందర్భంలో ( దీనిని కార్టీలేజ్ అని అంటారు), ఇంకా నడుము నొప్పి, కీళ్ల నొప్పులు మొదలైన సమస్యలు ఉన్నవారు వాడటం వల్ల గొప్ప ఫలితాన్ని పొందవచ్చు.

ఈ విత్తనాలు ఎలా తీసులోవాలి?

◆మహాబీర విత్తనాలు ఎలా తీసుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అందుకే వీటిని రాత్రి పూట ఒక గ్లాసుడు నీళ్లలో వేసి ఉంచాలి. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత పరగడుపున ఈ మహాబీర విత్తనాలను తీసుకోవడం వల్ల చక్కని పలితం ఉంటుంది.

◆మహాబీర విత్తనాలు రాత్రిపూట నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల. వీటిలో ఉన్న జిగురులాంటి పదార్థం బయటకు వచ్చి ఉంటుంది. అది శరీరంలో జరిపే క్రియల వల్ల కీళ్లలో ఆరోగిపోయిన గుజ్జు తిరిగి ఉత్పత్తి అవ్వడం మొదలుపెడుతుంది. అంతేకాకుండా మహాబీర విత్తనాల్లో ఉన్న ఫైబర్ శరీర జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తుంది. 

◆ప్రతిరోజు మహాబీర విత్తనాలను ఆపకుండా మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల ఎంతో కాలం ఇబ్బంది పెడుతున్న మోకాళ్ళ నొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంతే కాదు  వీటిని తీసుకోవడం వల్ల శ్వాశసంబంధ వ్యాధులను సులువుగా అధిగమించవచ్చు

◆ నానిన మహబీర విత్తనాల్లో పై పొరలో  విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

◆మన శరీరంలో ప్రకోపించిన అధిక వేడిని తగ్గించడానికి మహాబీర గింజలు మంచి పరిష్కారంగా ఉపయోగపడతాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి.

చివరగా…….

మహాబీర విత్తనాలను సాధారరణంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పై సమస్యలకు పరిష్కారం మాత్రమే కాకుండా శాశ్వతమైన ఉపశమనాన్ని పొందవచ్చు.అలాగే ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చు

7 thoughts on “ఇవి తీసుకుంటే అరిగిపోయిన మీ మోకాళ్ళు పుంజుకుని పరిగెడతారు”

Leave a Comment

error: Content is protected !!