Male Infertility Problems In Telugu

వీర్యం తక్కువ వస్తుందా అయితే ఇలా చేయండి

మగవారిలో సంతాన లేమి సమస్యకు ముఖ్యకారణం స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం మరియు వీర్యకణాల కదలిక తక్కువగా ఉండడం.అసలు వీర్యం విడుదల కానప్పుడు లేదా చాలా తక్కువగా ఉన్నప్పుడు స్త్రీ జననాంగంలో స్పెర్మ్ విడుదల అయినప్పుడు అందులో వీర్య కణాలు కదలిక ఎక్కువగా ఉన్నప్పుడు అవి గర్బాశయంలోని అండాన్ని చేరి ఫలదీకరణం చెందుతాయి లేకపోతే యోని బయటే ఆగిపోతాయి. వీర్యం బయటే ఉండిపోతుందని మనం కాళ్ళు పైకి పట్టి ఉన్నా ఫలితం ఉండదు. 

ఎందుకంటే వీర్యకణాల కదలిక ఉన్నప్పుడు అవి ఈదుకుంటూ అండాన్ని చేరతాయి. లేనప్పుడు సంతానలేమి సమస్య ఏర్పడుతుంది. కానీ లాబ్లో టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేసే పద్థతిలో వీర్యాన్ని సొల్యూషన్ తో శుభ్రపరిచి  అందులో ఉన్న ఆరోగ్య కరమైన కొన్ని కణాలను నేరుగా అండంతో కలుపుతారు. దీనివలన గర్బం దాల్చే స్త్రీ యొక్క భర్తే బిడ్డకు తండ్రవుతాడు. 

చాలావరకు పురుషులలో వృషణాలు చిన్నగా ఉండడం వలన వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది లేదా వీర్యం తయారయిన తర్వాత అది బయటకు వచ్చే మార్గంలో వీర్యకణాలకు ఇంధనంగా పనిచేసే ద్రవాలను ఆ గొట్టాల యొక్క గోడలు విడుదల చేస్తాయి. కానీ కొంతమందిలో ఇలా విడుదల అవకపోవడం వలన, లేదా అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం వలన  వీర్యకణాల నాణ్యత తగ్గిపోతుంది. అలాంటప్పుడు టెస్టికల్స్కి లోకల్ అనస్తీషియా ఇచ్చి సన్నటి సూదితో అందులోని ద్రవాలను తీసి అందులో ఉండే వీర్యకణాల ద్వారా ఐవిఎఫ్ చేసి మగవారు తండ్రి కావచ్చు.

 అలాగే అందువలనే టెస్ట్-ట్యూబ్ బేబీ అనేది విజయవంతమైన మానవ పునరుత్పత్తి యొక్క కృత్రిమ పద్థతి, ఇది స్త్రీ మరియు పురుషుల మధ్య లైంగిక సంపర్కం అవసరం లేకుండానే ఫలితం ఇస్తుంది మరియు  విజయవంతమైన ఫలదీకరణం కోసం గుడ్డు మరియు స్పెర్మ్ కణాలు రెండింటినీ కలిపి శిశువును తయారు చేయడానికి డాక్టర్లచే ఉపయోగించబడుతుంది. ఈరోజుల్లో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వలన సంతాన లేమి సమస్య ఎక్కువగా ఎదుర్కుంటున్న పురుషులకు ఈ పద్థతులు అద్బుతమైన వరమనే చెప్పుకోవాలి.

Leave a Comment

error: Content is protected !!