నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికే పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
దానికోసం మనం స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక పావులీటరు కొబ్బరినూనె వేసుకోవాలి. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు, జుట్టు రాలే సమస్యలు వస్తాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె అప్లై చేయాలి. నూనెలో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు జుట్టు మృదువుగా, పొడవుగా పెరగడానికి జుట్టు కుదుళ్ళను పటిష్టం చేయడానికి ఉపయోగకరమైనవి.
తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు విత్తనాలు విటమిన్ E తో లోడ్ చేయబడి ఉంటాయి. ఆవాలు విత్తనాల స్థాయిలో ఉన్న కొవ్వు ఆమ్లాలు మరియు మీ నిస్తేజమైన ప్రాణములేని తంతువులలో జీవాన్నీ ప్రేరేపిస్తాయి. B విటమిన్లు మీ జుట్టుకు ఒక అందమైన మెరుపు ఇవ్వడానికి సహాయం చేస్తాయి మరియు కూడా సేబాషియస్ గ్రంధుల ఉత్పత్తి నియంత్రించడానికి సహాయపడతాయి.
ఇందులో ఒక పది లవంగాలు, ఒక ఇంచు అల్లం ముక్కను తురిమి వేసుకోవాలి. లవంగాలు వాడడం వలన చుండ్రు నుండి విముక్తి పొందవచ్చు. ఫ్లైట్ స్కాల్ప్ ఇరిటేషన్స్ తగ్గిస్తుంది. అకాలంగా వచ్చే బూడిద రంగు జుట్టును నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఎర్రటి రేఖ మందారపువ్వులు మరియు ఆకులను కూడా వేసుకోవాలి. పురాతన కాలంనుండి మందార ఆకులు, పువ్వులు సౌందర్య రక్షణలో భాగంగా ఉపయోగిస్తున్నారు.
తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు జుట్టు నల్లగా ఉండేలా, కుదుళ్ళను బలంగా చేస్తాయి. ఈ నూనెను బాగా మరిగించాలి. నూనె రంగు మారగానే నూనెను వడకట్టి వాడుకోవచ్చు. స్ప్రే చేయవచ్చు లేదా చేతి వేళ్ళతో మృదువుగా అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ నూనెను వారానికి రెండు సార్లు తలకు అప్లై చేసి ఉదయం తలస్నానం చేయవచ్చు. అర్జెంట్ అనుకున్నవారు కనీసం రెండు గంటలు ఉంచుకొవడం వలన జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.